కరోనా తీసుకొచ్చిన విపత్తులో మానవత్వం మరుగున పడిపోతున్నది. ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే.. కనీసం ఈ వీధివైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. గతంలో కరోనా మృతదేహాలను.. ట్రాక్టర్లలో తరలించి.. జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన ఘటనలు ఎన్నో చూశాం. ఇక కరోనా రోగులను ఎంత దారుణంగా ట్రీట్ చేశారో ఎన్నో ఘటనలు చూశాం. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇదిలా ఉంటే తాజాగా అదే రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది.
కరోనాతో చనిపోయాడన్న కారణంతో ఓ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ చెత్త వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు.
మహారాష్ట్రలోని షక్రి తాలూకాలోని సమోద్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ, ఎంతసేపటికి అంబులెన్స్ రాలేదు. గ్రామ సర్పంచ్ ను వేడుకున్నా ఏమీ చేయలేకపోయాడు. దీంతో గ్రామపంచాయతీ వాళ్లు చెత్తను తీసుకెళ్లే వాహనంలో ఈ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి.
కరోనా వేళ మనుషులు ఎలా తయారయ్యారో అని చెప్పేందుకు ఈ ఘటన అద్దం పడుతున్నది. గతంలోనూ ఇటువంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.మరోవైపు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. సెకండ్‌వేవ్ విరుచుకుపడుతున్నది. రోజులకు లక్షా యాబైవేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.