కరోనా మృత్యుఘోష.. 24గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు , ఎన్నంటే ?

Update: 2021-06-10 05:30 GMT
మనదేశంలో కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ మరణమృదంగం వాయిస్తుంది. ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న సమయంలో , కరోనా వైరస్ మరణాలు భారీగా నమోదు అవుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు రికార్డ్ అయ్యాయి. బుధవారం కరోనా బారిన పడి 6,148 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ ప్రారంభం నాటినుంచి ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తోలిసారి. కాగా, గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కి పెరగగా, మరణాల సంఖ్య 3,59,676 కి చేరింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది. ఇకపోతే , నిన్న ఈ మహమ్మారి నుంచి 1,51,367 బాధితులు కోలుకున్నారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23,90,58,360 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,21,98,253 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,04,690 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Tags:    

Similar News