కరోనా విలయతాండవం.. మృతుల్లో 45 ఏళ్ల వారే ఎక్కువ..ఆ అధ్యయనం లో వెల్లడి !

Update: 2021-06-29 12:30 GMT
కరోనా ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.  ఒక ప్రైవేటు చైన్ ఆసుపత్రుల చికిత్సల డేటా ఆధారంగా సేకరించిన సమాచారం వెల్లడించింది. కరోనా ఫస్ట్ వేవ్ ,సెకండ్ వేవ్ లో అత్యధిక మరణాలు సంభవించాయని వెల్లడించింది. మ్యాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కరోనా సెకండ్ వేవ్ లో ఆసుపత్రిలో చేరిన రోగులలో మరణాల రేటు మొదటి వేవ్ కంటే 40% ఎక్కువ ఉందని అధ్యయనం లో తేలింది. సెకండ్ వేవ్ లో 2021 జనవరి నుండి జూన్ మధ్య వరకు ఆసుపత్రిలో చేరిన 5,454 మంది రోగుల మరణాల నిష్పత్తి 10.5% వద్ద ఉన్నట్టుగా ప్రైవేట్ చైన్ ఆస్పత్రుల డేటా ఆధారంగా గుర్తించారు. ఇది మహమ్మారి యొక్క మొదటి వేవ్ లో 2020 వ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ఆసుపత్రిలో చేరిన 14,398 మంది రోగులలో 7.2% మరణాల రేటు కంటే 40% ఎక్కువ. మెడికల్ జర్నల్ మెడ్ ఆర్క్సివ్‌ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, ఉత్తర భారతదేశం అంతటా మాక్స్ హెల్త్‌ కేర్ నిర్వహిస్తున్న10 ఆస్పత్రుల నుండి సేకరించిన కోవిడ్ డేటా, ఢిల్లీ -ఎన్‌ సిఆర్‌ లో ఆరు ఆస్పత్రుల ఆధారంగా తీసుకున్న డేటా ఆధారంగా ఉన్నాయి.

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన మాక్స్ హెల్త్‌ కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా మరణాలలో 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపించింది. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో సెకండ్ వేవ్ లో కరోనా కారణంగా మరణాలు మూడు రెట్లు పెరిగాయని ఆయన వెల్లడించారు. మరణాల పెరుగుదల ధోరణి ఇతర వయసులవారిలో కూడా కనిపించిందని వెల్లడించారు.  60-74 సంవత్సరాల వయసు వారిలో పెరుగుదల 12% నుండి 13.8%, 75 ఏళ్లు పైబడిన వారిలో 18.9% నుండి 26.9% వరకు పెరిగిందని వెల్లడించారు. సెకండ్ వేవ్ లో మరణాలు పెరగడానికి ఆసుపత్రులలో బెడ్ లు దొరక్క పోవటం, ఆక్సిజన్ కొరత, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కూడా కొన్ని కారణాలు అని అన్నారు.
 
 కరోనా ఫస్ట్ వేవ్ లో, ఆసుపత్రిలో చేరిన  రోగులలో 63% మందికి ఆక్సిజన్ మద్దతు అవసరం అయ్యిందని. కానీ సెకండ్ వేవ్ లో 74% అంటే ఆసుపత్రిలో చేరిన నలుగురిలో దాదాపు ముగ్గురికి ఆక్సిజన్ మద్దతు అవసరం అయ్యిందని అధ్యయనం వెల్లడించింది.కోవిడ్ -19 వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపించిందని, ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిందని వైద్యులు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదట గుర్తించిన ఈ జాతి ఇప్పుడు అమెరికా మరియు యుకెతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం,కరోనా థర్డ్ వేవ్ పై అలర్ట్ చేస్తోంది. అది కరోనా సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరంగా ఉండొచ్చని, ఇప్పటి నుండే దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధత ప్రణాళికను సిద్ధం చేసుకుని, పకడ్బందీ పాలసీతో ముందుకు వెళితే ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవచ్చు అని చెప్తుంది.
Tags:    

Similar News