కరోనాకు అంతం లేదు.. ఇంకో దశాబ్ధం భరించాల్సిందే.?

Update: 2022-02-08 07:35 GMT
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడక్కడ చూసిన కరోనా పేరే మారుమ్రోగిపోతుంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా ప్రపచంలోని అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచంలోని 200లకు పైగా దేశాల్లో కరోనా సోకింది. దీంతో ఆయా దేశాలు కరోనా కట్టడికి ఆంక్షలతో కఠిన చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కొత్తగా ఒమిక్రాన్ రూపంలో భయపెడుతోంది. కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి.

రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రెండేళ్ల పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుతుందన్న క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పీడ నుంచి ఎప్పుడు బయటపడుతామా అంటూ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం దశాబ్ధాల పాటు ఉంటుందని (డబ్ల్యూహెచ్ఓ ) తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ సోమవారం మాట్లాడారు. కరోనా వైరస్ ఎంత సుధీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా కేసులు తగ్గినప్పటికీ ఆ మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాలను ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాల పాటు మర్చిపోలేవని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటూ టెడ్రోస్ అథనమ్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఉన్నంత కాలం ఈ చేదు అనుభవాలు ఉంటాయని హెచ్చరించారు.

ఇక వ్యాక్సినేషన్ తీరుపై కూడా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కామన్వెల్త్ దేశాల్లో 42శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా పొందగలిగారని.. ఇంకా సగానికి పైగా టీకా తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23శాతం మాత్రమే ఉందన్నారు. టీకా పంపిణీలో వ్యత్యాసం చాలా ఉందని.. దీనిని పూడ్చి అందరికీ వ్యాక్సిన్ అందించడమే తమ సంస్థ తక్షణ కర్తవ్యం అని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం SARS-CoV-2 వైరస్ క తాజా వేరియంట్ B.1.1.529ని వర్గీకరించింది, ఇప్పుడు ఓమిక్రాన్ పేరుతో, "వేరియంట్ ఆఫ్ కన్సర్న్" (VOC)గా వర్గీకరించబడింది. WHO నిర్వచనం ప్రకారం, ప్రపంచ ప్రజారోగ్య ప్రాముఖ్యతతో కూడిన వీవోసీ, కోవిడ్-19 ఎపిడెమియాలజీలో ట్రాన్స్‌మిసిబిలిటీ పెరుగుదల హానికరమైన మార్పుగా పేర్కొంది. వైరలెన్స్ పెరుగుదల లేదా క్లినికల్ డిసీజ్ ప్రెజెంటేషన్‌లో మార్పు మరియు తగ్గుదల వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరస్పర మార్పులను ప్రదర్శిస్తుందని వివరించింది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తపడాలని.. సామాజిక చర్యలు లేదా అందుబాటులో ఉన్న డయాగ్నస్టిక్స్, టీకాలు చికిత్సా విధానాల ప్రభావం దీనిపై ఉంటుందని చెప్పలేమంది.. మెటాడేటాను పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్‌కు సమర్పించాలని.. ప్రారంభ కోవిడ్ కేసులు లేదా క్లస్టర్‌లను WHOకి నివేదించాలని దేశాలను కోరింది.

ఒమిక్రాన్ మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందో లేదో ఇంకా డబ్ల్యూహెచ్ఓ స్పష్టంగా తెలియజేయలేదు, అయితే ప్రాథమిక డేటా ప్రకారం.. దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరే వారి రేటు పెరుగుతోందని రిపోర్టులు సూచిస్తున్నాయి, అయితే ఇది మొత్తంగా సోకిన వ్యక్తుల సంఖ్య పెరగడం వల్ల కావచ్చని నివేదించింది. ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత స్థాయిని అర్థం చేసుకోవడానికి చాలా వారాల సమయం పడుతుంది కాబట్టి ఓమిక్రాన్ తో అనుబంధించబడిన లక్షణాలు ఇతర రూపాంతరాల నుండి భిన్నంగా ఉన్నాయని సూచించడానికి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదని WHO ధృవీకరించింది.

కోవిడ్-19 ఎపిడెమియాలజీ, ప్రజారోగ్యం.. సామాజిక చర్యల ప్రభావం.. యాంటీబాడీ న్యూట్రలైజేషన్‌పై    అర్థం చేసుకోవడానికి క్షేత్ర పరిశోధనలు ప్రయోగశాల అంచనాలను కూడా ఇది సిఫార్సు చేసింది.
Tags:    

Similar News