ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న.. కొత్త జన్యు రూపాలతో విజృంభిస్తున్నది. బ్రిటన్ లో కొత్త వేరియంట్ చాలా రోజులపాటు హడావుడి చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వేరియంట్ వచ్చింది. కొత్త వేరియంట్ల ఎఫెక్ట్‌తో పలు దేశాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. ఇదిలా ఉంటే మనదేశంలోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. దీంతో అక్కడ ఆంక్షలు అమలుచేస్తున్నారు.
ఇదిలా ఉంటే జపాన్ లో ఓ కొత్త వేరియంట్ ను వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది అంటే మరో మూడు నెలల్లోనే జపాన్‌లో ఒలంపిక్ గేమ్స్ జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ గేమ్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానం నెలకొన్నది. జపాన్ లో అనేక కొత్త వేరియంట్లు అంటే జన్యుమార్పిడి చెందిన వైరస్లు గుర్తించామని అక్కడి అధికారులు అంటున్నారు. వైరస్ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కూడా ప్రధాని చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు ఒలంపిక్స్ కు భయాన్ని కలిగిస్తున్నాయి. ఒసాకాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో టోక్యోను అలర్ట్ చేశారు. ఈ కొత్త జన్యుమార్పిడి చెందిన వైరస్ కు ఈక్ అనే పేరుపెట్టారు.
టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం కేసులను ఈక్ వైరస్ లుగా నిర్ధారించారు. గత ఆదివారం ఒక్క రోజే టోక్యోలో 355 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇవన్నీ ఈక్ స్ట్రెయిన్ యేనని అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్, వేగవంతంగా విస్తరిస్తుందని భయపడుతున్నారు. ఒసాకా ప్రిఫెక్చర్లో ఆదివారం మొత్తం 594 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రికార్డు స్థాయిలో 666 కేసులు నిర్ధారించబడిన ఒక రోజు తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి.E484 ( ఈక్) మ్యుటేషన్ తో జపాన్ వాసులు వణికిపోతున్నారు. ఈ మ్యుటేషన్ పై కనీసం వ్యాక్సిన్ అయినా పనిచేస్తుందా లేదా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.