ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ కరోనా ప్రభావం తాజాగా స్టాక్ మర్కెట్స్ పై కూడా ప్రభావం చూపించింది. నేడు శుక్రవారం..స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే భారీ నష్టాల్లో కూరుకు పోయాయి. కరోనా వైరస్ ప్రభావం తో ..దాదాపు గా ఈ వారమంతా స్టాక్ మార్కెట్లు నష్టాల మధ్యనే ట్రేడ్ అయ్యాయి. దీనితో భారత్, ఆసియా, ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 1,071.62 పాయింట్లు (2.70 శాతం) నష్టపోయి 38674.04 వద్ద, నిఫ్టీ 319.80 పాయింట్లు (2.75 శాతం) నష్టపోయి 11313.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
ఆ తర్వాత సెన్సెక్స్. గత 12 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా 11,00 పాయింట్లకు పైగా నష్టపోయింది. 110 షేర్లు లాభాల్లో ఉండగా, 873 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 31 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డాలరు తో రూపాయి మారకం విలువ 71.66 వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన నాస్ డాక్ 3.7 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీ ఎస్ ఈ 3.3 శాతం, ఇటలీ మార్కెట్లు 6 శాతం మేర నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.66 వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించింది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు.
అయితే , 2008 ఆర్థిక మాంద్యం అనంతరం ప్రపంచ మార్కెట్లు వరుసగా వారం రోజులు ఈ విదంగా నష్టపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 42వేల దరిదాపుల్లో ఉన్న సెన్సెక్స్ ఏకంగా 38 వేలకు దిగజారింది. అంటే ఒక్క వారంలోనే 4వేలకు పైగా పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ దారిలోనే నిఫ్టీ కూడా 12 వేల పై చిలుకు నుండి 11,300కు దిగజారింది. మొత్తంగా ఈ రోజు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే తమ ట్రేడింగ్ ప్రారంభించాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, జేఎస్ డబ్ల్యూ ఉన్నాయి...