కరోనా...కల్లోలం ..10 నిమిషాల్లో రూ.10 లక్షల కోట్లు మాయం !

Update: 2020-03-23 10:30 GMT
కరోనా వైరస్ దెబ్బకి గత కొన్ని రోజులు మార్కెట్లు పతన దిశగా సాగుతున్నాయి. కరోనా వైరస్ ప్రపంచం పై ప్రభావం చూపకముందు ..రికార్డ్ స్థాయికి చేరిన సెన్సెక్స్ ..కరోనా దెబ్బకి పాతాళానికి పడిపోయింది. దీనితో ఇప్పటికే కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ఇక తాజాగా నేడు సెన్సెక్స్ 2600 పాయింట్ల నష్టంతో ప్రారంభమైం మధ్యాహ్నానికి 3500 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ కూడా వెయ్యి పాయింట్లు దిగజారింది.  10శాతం పతనంతో లోయర్ సర్క్యూట్‌ ను తాకడంతో  45 నిమిషాలు నిలిపివేశారు. సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు నష్టపోయినప్పుడు ఏకంగా 10 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. సెన్సెక్స్ 10 శాతం నష్ట పోవడంతో దీనిని నిలిపి వేయడానికి ముందే పెద్ద మొత్తంలో కోల్పోయారు. పది గంటల సమయంలో ట్రేడింగ్ నిలిపివేశారు.

దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. సెన్సెక్స్ 2600 పాయింట్లు కోల్పోయిన ప్రారంభ 15 నిమిషాల్లోనే లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఐసీఐసీఐ - అల్ట్రా టెక్ - యాక్సిస్ బ్యాంకు - బజాజ్ ఫైనాన్స్ - మారుతీ వంటి టాప్ కంపెనీలు 10 శాతం మేర నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం - ఆ ప్రభావం మర్కెట్స్ పై కనిపిస్తుంది.  ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 12 శాతం పతనమై ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను నమోదు చేసుకుంటోంది. ముఖ్యంగా దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్ - యాక్సిస్ బ్యాంక్ షేర్లు  భారీగా నష్టపోతున్నాయి. ఏడాది గరిష్ట స్థాయి నుంచి కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ స్టాక్స్ ఏకంగా 45 శాతం పైగా పతనం అయ్యాయంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో  ఊహించుకోవచ్చు.

కాగా  ప్రపంచ మాంద్యం  నెలకొనే అవకాశం - ఆయా దేశాల సెంట్రల బ్యాంకుల తీవ్ర చర్యలు - లాక్‌ డౌన్ల ఆటుపోట్ల కారణంగా ఆసియా షేర్లు పడిపోయాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇకపోతే, దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపివేయడం ఈ నెలలో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం నిఫ్టీ 10 శాతం నష్టపోవడంతో 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇప్పుడు సెన్సెక్స్ నిలిపేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ..మార్కెట్లు పూర్తిగా క్లోజ్ చేసే అవకాశాలు  ఉన్నాయని కొందరు నిపుణులు చెప్పుకొస్తున్నారు.
Tags:    

Similar News