ఏళ్లు గడుస్తున్నాయి. క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ కరోనా వైరస్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి తిరిగి తన ప్రభావాన్ని మరో కొత్త వేరియంట్ రూపంలో చూపిస్తూనే ఉంది. ఈ ఏడాదైనా హాయిగా ఉండొచ్చని అనుకునేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు వేరియంట్ లతో అప్డేట్ అవుతూ మానవజాతి మీద పగ తీర్చుకుంది. ఈ క్రమంలోనే వివిధ దేశాల్లో లక్షల కొద్దీ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్త ఏడాది వచ్చిన రెండో రోజే మనదేశంలో కేసుల సంఖ్య 25 వేలకు చేరింది. కేసుల సంఖ్య ఇదే క్రమంలో పెరుగుతూ పోతే మరో రెండు మూడు వారాల్లోనే 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ ను రీచ్ అయ్యే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే భారత్ లో మూడో వేవ్ కచ్చితంగా వచ్చినట్లే అని అంటున్నారు. మన దేశంలో డెల్టా వేరియంట్ ఉద్ధృతి కొనసాగిన సమయంలో దిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం గతంలో మాదిరిగానే అవే రాష్ట్రాలలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను కఠినతరం చేయాలని భావిస్తున్నాయి. దిల్లీకి పక్కనే ఉన్నటువంటి హర్యానా లో కేసులు పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని స్కూల్స్ మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకూ పాఠశాలలో పునః ప్రారంభించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దిల్లీతో సరిహద్దు పంచుకునే రాష్ట్రమైన హర్యానా ... కరోనా వైరస్ ఆంక్షలను అమలు చేయడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే స్కూల్స్ మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా థియేటర్లు, జిమ్ములు స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుమారు ఐదు జిల్లాల్లో ఆంక్షలను చాలా కఠినంగా అమలు చేస్తోంది. ప్రత్యేకించి దిల్లీలో భాగం అయినటువంటి కొన్ని జిల్లాలను నోటిఫై చేసి ఆ ప్రాంతాలలో వ్యాపార కార్యకలాపాలను కూడా కుదించింది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వాటికి పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి కూడా ఇందులో మినహాయింపు కల్పించలేదు. ఈ సంస్థలలో కేవలం 50 శాతం మాత్రమే కార్యాలయాలు పని చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేసే జిల్లాలలో ముఖ్యంగా దిల్లీని ఆనుకుని ఉండే ఫరీదాబాద్, సోనిపట్, అంబాల జిల్లాలు ఉన్నాయి.
శనివారం ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 11 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. అగ్రరాజ్యమైన అమెరికా లో కేసుల సంఖ్య భారీగా తగ్గిన... ఇతర దేశాల్లో మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అంతకంతకూ పెరిగి లక్షల్లోకి కేసుల సంఖ్య చేరుకుంటుంది. అయితే ఇదే క్రమంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ తీసుకుంటే తగ్గుముఖం పడుతుందని అందరూ భావించినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం ఎక్కడ తగ్గినట్లు కనిపించినా లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుంది. ఈ క్రమంలోనే భారత్ లో కూడా వైరస్ కేసులు రోజు రోజుకు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసుల సంఖ్య పది వేల లోపు ఉండేది. అయితే కొత్త సంవత్సరానికి ఈ కేసుల సంఖ్య 20 వేలకు చేరుకుంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు కూడా భారత్ లో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అని ఆ లేఖలో ప్రస్తావించింది.