కరోనా ఎఫెక్ట్‌ : దేశవ్యాప్తంగా టోల్‌ ట్యాక్స్‌ రద్దు !

Update: 2020-03-26 10:30 GMT
కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం దేశం మంతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏప్రిల్ 15 వరకు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన కారణంగా ఇంట్లో నుండి ఎవరికీ బయటకి రావొద్దు అని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులపై ఉన్న టోల్ కేంద్రాల్లో టోల్ చెల్లించడాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. నిత్యవసర సరుకులను మరింత వేగంగా ప్రజలకు దగ్గరకు చేర్చేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది.  దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది. కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది. ఈ వైరస్‌ కు విరుగుడు కనుగోనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే బీబీనగర్ సమీపంలోని గూడూరు టోల్ ప్లాజాకు ఈ ఆదేశాలు అందడంతో - నిన్న రాత్రి నుంచే వాహనాలను ఉచితంగా అటూ - ఇటూ తిరగనిస్తున్నారు. టోల్ బూత్ లలో పని చేసే సిబ్బందిని ఇళ్లకు పంపించి వేశారు. కాగా, ఈ టోల్ ప్లాజా నుంచి 23న 10,650 వాహనాలు, 24న 3,880 - 25న 1,650 వాహనాలు వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా తగ్గడం - వచ్చి పోతున్న వాహనాలు - పోలీసులు - డాక్టర్లు - పాలు - నిత్యావసరాల వాహనాలే కావడంతో నేషనల్ హైవేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News