ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. నిత్యం ప్రజలతో ఉండటం.. సమావేశాలకు హాజరవుతున్న దృష్ట్యా ఎమ్మెల్యేలకు కూడా కరోనా సులభంగా సోకుతోంది.
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. దీంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన శ్రీదేవికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేరారు.అయితే ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ చేరడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తోంది. అటు శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో ప్రత్యేక దృష్టి పెట్టి ఆరాతీస్తున్నట్టు సమాచారం.
తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా తేలిన మాట వాస్తవమేనని.. అయితే అశ్రద్ధ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీదేవి చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీదేవి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని.. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.