ట్రంప్ కోరిక... పనామా కాలువ ఎందుకంత కీలకమో తెలుసా?
అమెరికా కార్గో షిప్ లకు సెంట్రల్ అమెరికా దేశమైన పనామా.. అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తుందోదని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల పనామా కాలువ గురించి కీలక వ్యాఖ్యలు చేయగా.. అది ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్ సైట్ కార్ట్ లో పెట్టుకుని చెక్ అవుట్ చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారన్నట్లు ఆయన కుమారుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. విషయాన్ని మరింత సీరియస్ చేశారని అంటుంటారు.
అవును... అమెరికా కార్గో షిప్ లకు సెంట్రల్ అమెరికా దేశమైన పనామా.. అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తుందోదని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ ఛార్జీలు తగ్గించాలి, లేకపొతే దాని నియంత్రణను తమకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. పనామా వసూలు చేస్తున్న ఛార్జీలో ఎంతో ఆర్థిక భారంగా మారుతున్నాయని తెలిపారు.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ మునిలో స్పందించారు. ఇందులో భాగంగా... పనామా కాలువలోని ప్రతీ చదరపు మీటరూ తమదే అని.. దాని చుట్టుపక్కల ప్రాంతం కూడా తమదే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో... పనామా కాలువ ఎందుకు ఇంత కీలకం అనే చర్చ తెరపైకి వచ్చింది.
అట్లాంటిక్, ఫసిఫిక్ మహా సముద్రాలను కలిపే ఈ పనమా కాలువ 82 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని 1900 ప్రారంభంలో నిర్మించడం మొదలుపెట్టగా.. 1914లో ప్రారంభించారు. అంటే.. కాలువ మొదలై దాదాపు 110 ఏళ్లు పూర్తయ్యాయన్న మాట. దీన్ని సమర్థవంతమైన ఇంజినీరింగ్ రిజల్ట్ గా పిలుస్తుంటారు.
వాస్తవానికి 1977 వరకూ ఈ కాలువ అమెరికా నియంత్రణలోనే ఉండేది. ఆ తర్వాత పనామా - అమెరికా సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. ఈ క్రమంలో 1999లో ఈ కాలువపై పనామా దేశం పూర్తి నియంత్రణను పొందింది. ఇది ఆ దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరుగా మారింది. పనమా ప్రగతిలో ఈ కాలువ కీలకం అని అంటారు.
ఈ పనామా కాలువ మీదుగా ఏటా సుమారు 14,000 నౌకలు ప్రయాణిస్తాయని చెబుతున్నారు. వీటిలో చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలతో పాటు కార్లను మోసుకెళ్ళే కంటైనర్ షిప్స్ ఎక్కువగా ఉంటాయని అంటారు. ఈ సమయంలో పనామా దేశం అత్యధిక ఛార్జీలు వసూలు చేసుందని ట్రంప్ ఫైర్ అవుతున్నారు.
మరి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ కాలువతో పాటు కెనడా, మెక్సికో, చైనా, భారత్ సుంకాలపైనా ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.