కరోనా భయం ...చివరి చూపుకు రాని బంధువులు !

Update: 2020-03-28 02:30 GMT
కరోనా భయం అందరిలో ఎలా ఉందొ తెలిపే సంఘటన ఒకటి తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ ఆరోగ్య సమస్యల తో మృతి చెందారు. అయితే , ప్రస్తుతం కరోనా కోరలు చాచుకొని కూర్చొని ఉండటంతో, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీనితో కడసారి చూపుకు నోచుకోక అనాథ శవంలా మారింది రాజవ్వ శవం.

రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు.‌ వీరికి సంతానం లేదు. భర్త మృతి చెందినప్పటి నుండి మానసిక ఆందోళనలో ఉన్న రాజవ్వ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానికులు , ఆమె బంధువులకి సమాచారం ఇచ్చినా కూడా కరోనా భయంతో ఎవరు రాజవ్వ మృతదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. 24 గంటలు గడిచిన ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడం తో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో రాజవ్వ శవం అనాథగా తరలిపోవడం చూసిన ఆ గ్రామస్థులు కంటతడి పెట్టారు.

కాగా , దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 775కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 542,263 మంది కరోనా భారిన పడగా ... 24,369 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు.
Tags:    

Similar News