రాబోయే రోజుల్లో కరోనాకి కేంద్రంగా ఆఫ్రికా మారబోతుందా ? అమెరికా, యూరప్ లను మించిన స్థాయిలో ఆఫ్రికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుందా? అంటే అవుననే అంటున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ఆఫ్రికా భవిష్యత్ లో కరోనా కోరల్లో చిక్కుకుంటుంది అని సమాచారం. ఈ కరోనా మహమ్మారి విజృంభించకుండా ఎన్ని రకాలైన చర్యలు తీసుకున్నా కూడా .. ఆఫ్రికాలో ఈ ఏడాది మూడు లక్షలమంది కరోనాతో చనిపోయే ప్రమాదముందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ మోడల్ అంచనా వేసింది.
ఐరోపా తరహాలో ఇక్కడ వైరస్ విజృంభించే అవకాశముందని ఆఫ్రికాను హెచ్చరించింది. ఒకవేళ ఈ మహమ్మారిని కట్టడి చేయలేకపోతే 120 కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదముందని ఆఫ్రికాపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ మహమ్మారి సోకకుండా కఠిన నియమాలు పాటిస్తే .. 12 కోట్ల 20 లక్షల మందికి వైరస్ సోకుతుందని అంచనా వేసింది.
ఇలా కరోనా మహమ్మారి వ్యాప్తికి కేంద్రంగా ఆఫ్రికా మారుతుందని, పేదరికంతో పాటు వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల ఆఫ్రికా ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడే ప్రమాదముందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపోతే , ఇప్పటివరకు ఆఫ్రికా లో 19 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే , వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో 60 శాతం మంది పట్టణ ప్రజలు మురికి వాడల్లోనే నివస్తున్నారు. వీళ్లకు కనీస నీటి సదుపాయాలు, వైద్యం అందుబాటులో లేవు ఈ కారణంగానే అక్కడ ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది అని WHO చెబుతోంది.