బ్యాడ్మింటన్ క్రీడను ఆవహించిన కరోనా.. ఏకంగా ఏడుగురికి పాజిటివ్

Update: 2022-01-13 08:34 GMT
బ్యాడ్మింటన్ క్రీడను కరోనా ఆవహించింది. ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్ లో మొత్తం ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో టోర్నీలో కలకలం మొదలైంది.

మాజీ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురు వైరస్ బారినపడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీ.డబ్ల్యూఎఫ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారని వివరించింది.

కరోనా బారినపడ్డ వారిలో రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు సాధించిన అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, ట్రెస్సా జోలి, మిథున్ మంజునాథ్, సిమ్రన్ అమాన్ సింఘీ, కుషి గుప్తా ఉన్నారు.  మరోవైపు ఈ క్రీడాకారుల డబుల్స్ పార్ట్ నర్స్ సైతం టోర్నీ నుంచి వైదొలిగారని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.

వైరస్ సోకిన వారికి బదులుగా వేరే వారిని తీసుకునే ప్రసక్తే లేదని. దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( బీఏఐ) ధ్రువీకరించింది.

జనవరి 11న మొదలైన ఈ ఇండియా ఓపెన్ టోర్నీలో గురువారం రెండో దశ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే ఏడుగురు క్రీడాకారులకు వైరస్ సోకినట్లు తేలింది.  తకుముందు సాయి ప్రణీత్ కు సైతం కరోనా పాజిటివ్ గా తేలడంతో టోర్ని నుంచి నిష్క్రమించాడు.

మరోవైపు ఇంగ్లండ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారులు సైతం వైరస్ బారినపడడంతో ఇంగ్లండ్ జట్టు కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాండ్మింటన్ ఇండియా అసోసియేషన్ ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది. టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా? తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News