శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడేది కరోనాపైనే.. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వినిపిస్తోంది. అమెరికా, భారత్ లలో శరవేగంగా విస్తరిస్తోంది. మందులేని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడం ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. మందు లేక.. వ్యాక్సిన్ లేక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. నివారణే లేని ఈ వ్యాధిని నయం చేస్తుందంటూ మార్కెట్లోకి ఎన్నో రకాల ఆయుర్వేద, హోమియో, ఇతర చెట్ల పసర్లు కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి.
తాజాగా కొన్ని ఆయుర్వేద సంస్థలు తమ లేహ్యాలు తింటే కరోనా రాదని.. తగ్గుతుందని కూడా మీడియాలో ప్రకటనలు ఇస్తున్నాయి. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. కొంతలో కొంత ఊరటనిస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. కానీ కరోనా ను మాత్రం ఇవి కంట్రోల్ చేయవని వైద్య నిపుణులు అంటున్నారు.
తాజాగా తమిళనాడు రాష్ట్రంలోనూ అలాంటిదే ఒకటి పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రంలోని సిద్ధ నేషనల్ ఇన్ స్టిట్యూట్ డాక్టర్లు తాజాగా తాము తయారు చేసిన ‘కబాసుర కుడినీర్’ అనే కషాయం తాగితే కరోనా తగ్గిపోతుందని.. రాదని.. బాగా పనిచేస్తోందని ప్రచారం మొదలుపెట్టారు.
వైరల్ ఫీవర్లకు మందుగా పనిచేసే ఈ కషాయం 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే 2 దశల పరీక్షలు పూర్తయ్యాయని.. కషాయం కరోనా బాగా పనిచేస్తోందని.. 3వ దశ పరీక్షలు పూర్తయితే భారత ప్రభుత్వ ఐసీఎంఆర్ అనుమతితో కరోనా రోగులకు దీనిని ఇవ్వవచ్చని డాక్టర్లు అంటున్నారు. మరి ఈ కషాయం ఎంత పనిచేస్తుందనేది వేచిచూడాలి.