కరోనా అమెరికా ప్రజల జీవితాన్ని మార్చేసింది

Update: 2022-01-02 23:30 GMT
కోవిడ్-19 ఉధృతి ఇప్పటికీ తగ్గడం లేదు. రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. యూరప్ దేశాలు, అమెరికాను గుప్పిటపట్టి వేధిస్తోంది. నూతన సంవత్సరం మొదటి నెలలో మిలియన్ల మంది అమెరికన్ల రోజువారీ జీవితాన్ని కరోనా మార్చేసిందని అక్కడి మీడియా నివేదించింది.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి తాజా డేటా ప్రకారం, అమెరికాలో శుక్రవారం  3,86,000 కంటే ఎక్కువ కొత్త రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఆల్-టైమ్ అత్యధిక కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.  

"న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్  శనివారం అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపారు. న్యూయార్క్  స్వంత రికార్డును  నమోదు చేసిందన్నారు. 85,476  కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయన్నారు.  న్యూయార్క్‌లో 26,737 కేసులు నమోదు కావడంతో డిసెంబరు 27 నుండి ఒక రోజు కేసుల  సంఖ్య 219 శాతం పెరిగింది.

"ఒమిక్రాన్ నిజంగా ప్రతిచోటా ఉంది. వచ్చే నెలలో  ముసురుకోవడం ఖాయం. మన ఆర్థిక వ్యవస్థ మూసివేయబడుతుందనేది ఫెడరల్ ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కాదు, కానీ మనలో చాలా మంది కోవిడ్ బారిన పడడంతో  ఆర్థికవ్యవస్థ కూడా కుప్పకూలుతుంది." అని బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్   డాక్టర్ మేగాన్ రన్నీ నివేదికలో పేర్కొన్నారు.

జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSSE) ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా 54,859,966 మరియు 825,816 కేసులు మరియు మరణాలతో అమెరికా అత్యధికంగా దెబ్బతిన్న దేశంగా కొనసాగుతోంది. పిసిఆర్ పరీక్ష ద్వారా న్యూజెర్సీలో 28,000 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని గవర్నర్ ఫిల్ మర్ఫీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.   గవర్నర్ ఈ సంఖ్య "కేవలం రెండు వారాల క్రితం నుండి నాలుగు రెట్లు ఎక్కువ అయ్యిందని తెలిపారు.  గత శీతాకాలపు ఉప్పెన సమయంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ" అని వివరించారు.

ఓహియోలో ఆసుపత్రులు సిబ్బంది కొరతతో పోరాడుతున్నందున సుమారు 1,250 మంది నేషనల్ గార్డ్ సభ్యులను ఆస్పత్రిలో మోహరించి సేవలందించినట్టు  గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించారు.  యుఎస్‌లో హాలిడే ట్రావెల్ సీజన్‌లో కరోనావైరస్  ఓమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో ఎయిర్‌లైన్ కార్యకలాపాలు పడిపోయాయి. కొత్త సంవత్సరం రోజున 2,000 విమానాలు రద్దు చేయబడ్డాయి.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తాజా డేటా ప్రకారం, గత వారంలో యుఎస్ అంతటా పిల్లలు  కోవిడ్ ఆసుపత్రిలో చేరడం 58 శాతం పెరిగింది. అమెరికాలో సగటున రోజుకు 260 పీడియాట్రిక్ కేసులు కోవిడ్-19 ఆసుపత్రిలో చేరుతున్నారు. ఒక వారంలో దాదాపు 30 శాతం పెరిగింది, డిసెంబర్ 21-డిసెంబర్ 27 నుంచి ఆ డేటా నమోదైంది.   పిల్లలతో సహా అన్ని వయసుల వారికి టీకాలు వేయని వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు.
Tags:    

Similar News