దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. ఇప్పుడిప్పుడే పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
దేశవ్యాప్తంగా పిల్లలంతా బడి బాట పట్టారు. కరోనా తగ్గుముఖం పట్టిందన్న భరోసాతో తల్లిదండ్రులు కూడా వారిని పాఠశాలలకు నిర్భయంగా పంపిస్తున్నారు. కానీ గత వారం రోజుల నుంచి రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో మళ్లీ భయం మొదలైంది. మరోసారి కరోనా మహమ్మారి భారత్‌లో విజృంభించడం ప్రతి ఒకరిని ఆందోళనకు గురి చేస్తోంది.
గతవారం నుంచి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా 12వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 111 రోజుల్లో 12వేలకు పైగా కేసులు రావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 12,213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 11 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడు బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నాయి. 7624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు గత 24 రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.
తాజా కేసులతో కలిపి.. దేశంలో ఇప్పటి వరకు 4,32,57,730 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,26,74,712 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 5,24,803 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసులు పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 58,215కి పెరిగింది. బుధవారం రోజున 5.19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 12,213 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా.. ఇప్పుడు 2.35 శాతానికి పెరిగింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలలో కేసులు రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మహారాష్ట్రలో 4,024 , కేరళలో 3,488, ఢిల్లీలో 1,375 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
కేరళలో పాజిటివిటీ రేటు (13.38) ఎక్కువగా ఉందని.. అక్కడ ప్రతి 100 మందిలో 13 మందికి పాజిటివ్ వస్తోందని ఆ కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (8.92), మిజోరాం (8.23) ఉన్నాయని తెలిపింది.