దారుణం: జేసీబీతో కరోనా మృతదేహం తరలింపు

Update: 2020-09-06 16:04 GMT
కరోనా భయం జనాలను ఆవహించింది. కరోనా కారణంగా మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కరోనా సోకితే సొంత వారిని కూడా దూరం పెడుతున్న ఘోరం మన సమాజంలో చోటుచేసుకుంది.

ప్రస్తుతం కరోనాతో మృతిచెందిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సొంత కుటుంబ సభ్యులు, బంధువులే రోగుల అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బందే అంత్యక్రియలకే దిక్కవుతున్నారు.

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీలో తరలించిన దారుణం వెలుగుచూసింది.

వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడ్డాడు. దీంతో బంధువులు, గ్రామస్థులు అతడి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులే పీపీఈ కిట్లు ధరించి జేసీబీలో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం ప్రజలను ఎంత సామాజిక బంధాలకు దూరం చేస్తుందనేది అర్థమవుతోంది.
Tags:    

Similar News