కరోనా వైరస్ .. ఈ పేరు వింటేనే చాలామంది గడగడ వణికిపోతున్నారు. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయినా , వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా దీన్ని మాత్రం పూర్తిగా అరికట్టడంలో విఫలం అవుతున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. సెకండ్ వేవ్ లో కరోనా జోరు మరింతగా పెరిగిపోయింది. ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నా కూడా కరోనా జోరు తగ్గకపోవడం అటువుంచి పెరిగిపోతుండటం తో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కరోనాను అరికట్టడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ను అమల్లోకి తీసుకువచ్చాయి. కరోనా జోరు తగ్గకపోతే మరోసారి లాక్ డౌన్ తప్పదు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ... తాజాగా మరో కీలక అంశం మొత్తం దేశాన్ని షాక్ కి గురిచేస్తుంది. కరోనా వైరస్ సెగ దేశ అత్యున్నత న్యాయస్థానానికీ తాకింది. ఊహించని రీతిలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సుప్రీం కోర్టులో ఒక్కరితో మొదలైన ఈ కరోనా ఆ తర్వాత వారి నుండి ఇంకొకరికి , మరొకరికి ఇలా సుప్రీం కోర్టు సిబ్బంది లో చాలామందికి సోకిందట. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం .. సుప్రీం కోర్టులోని 50 శాతం మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారట. దీనితో ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండటంతో సుప్రీంకోర్టులోని కేసుల విచారణ ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక్కసారిగా ఊహించని రేంజ్ లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణం తో సుప్రీం కోర్టు ఆవరణం మొత్తం ఇంచు కూడా వదిలిపెట్టకుండా శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. కోర్టులోని అన్ని బెంచీలు గంట ఆలస్యంగా విచారణ మొదలు కానున్నాయి.
గత కొన్ని రోజులుగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. ఈ రోజు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. అలాగే, 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.