భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్పస్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుల పెరుగుదలతో పాటు క్రియాశీల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనాతో చైనాలాంటి దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తాజాగా హెల్త్ డైరెక్టర్ కూడా ప్రకటించారు.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 2527 కొత్త కోవిడ్ 19 కేసులు ,నమోదయ్యాయి. ఇక కోవిడ్ తో 33మంది మరణించారు. భారతదేశంలో 2000 కంటే ఎక్కువ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను నమోదు చేయడం వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. శనివారం నాటి సంఖ్యతో పోలిస్తే.. దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 15079కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 0.04 శాతానికి పెరిగినట్లుగా తెలుస్తోంది.
రోజువారీ సానుకూలత రేటు 0.56 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1656 మంది రోగులు కోలుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724కు చేరుకుంది. శుక్రవారం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న నమోదైన 33 కరోనా మరణాలు కేరళలో నమోదైన మృతుల సంఖ్య 31 కాగా.. మరో రెండు మరణాలు ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.22 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక కేసుల కంటే రికవరీలే తక్కువగా నమోదవడం ప్రధానంగా కనిపిస్తోంది. రికవరీ రేటు దేశంలో 98.75 శాతానికి చేరుకోవడం ఉపశమనంగా ఉంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో నిన్న 1042 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10 తర్వాత అత్యధికంగా 4.64 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.
ఇక దేశంలో నిన్న ఒక్కరోజే 19.13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వగా.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 187 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.