ప‌వ‌న్ కు క‌రోనా నెగెటివ్.. నిజం కాదా?

Update: 2021-04-21 04:03 GMT
జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్నార‌ని తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రోసారి చేసిన పరీక్ష‌లో ఆయ‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని నిన్న‌టి నుంచి ప్ర‌చారం సాగుతోంది. మీడియాలో కూడా ఈ వార్త వ‌చ్చేసింది. కానీ.. ఇందులో వాస్త‌వం ఎంత అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ సందేహాలకు కార‌ణాలు లేక‌పోలేదు. వారం రోజుల క్రితం త‌న వ్య‌క్తిగ‌త, భ‌ద్ర‌తా సిబ్బంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగా ప‌వ‌న్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధికారికంగా ప్ర‌క‌టించింది. పార్టీ లెట‌ర్ హెడ్ మీద మీడియా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌డం.. ప‌రీక్ష చేయించుకోవ‌డంతో పాజిటివ్ రావ‌డం జరిగిపోయాయి. దీంతో.. పవన్ వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‌ఈ విష‌యాన్ని కూడా జ‌న‌సేన పార్టీ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది.

కానీ.. ప‌వ‌న్ కు నెగెటివ్ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని మాత్రం అధికారికంగా నిర్ధారించ‌లేదు. నిన్న‌టి నుంచీ ఈ ప్ర‌చారం సాగుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో.. చాలా మంది సందేహిస్తున్నారు. నిజంగా నెగెటివ్ వ‌చ్చి ఉంటే.. మీడియా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసేవారు క‌దా అని అంటున్నారు.

ఈ సందేహాల న‌డుమ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటో త‌మ‌కు వెంట‌నే తెలియ‌జేయాల‌ని కోరుతున్నారు. నెగెటివ్ వ‌చ్చిందా లేదా? ప్రస్తుతం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి ఏంట‌న్న‌ది చెప్పాల‌ని వేడుకుంటున్నారు. మ‌రి, అభిమానుల కోస‌మైనా జ‌న‌సేన స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది.

కాగా.. ప‌వ‌న్ కు వైద్యం అందించ‌డానికి స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు అందుబాటులో ఉన్నారు. రామ్ చరణ్-ఉపాసనకు చెందిన అపోలో ఆసుప‌త్రి నుంచి ఒక‌రు, అలాగే ఖ‌మ్మం నుంచి మ‌రొక వైద్య‌నిపుణుడు వ‌చ్చి ప‌వ‌న్ వ‌ద్ద ఉండి చికిత్స అందిస్తున్నారు.
Tags:    

Similar News