ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది. కరోనా సంక్రమణ ప్రపంచాన్ని ఇంకా వీడటం లేదు. ఎప్పటికప్పుడు కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకూ ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్ ఉపవర్గంగా ఏవై 4.2 ఇప్పుడు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఏవై 4.2 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరల్‌లో రెండేళ్లుగా జన్యుపరమైన మార్పులు చోటు చేసుకోవడమే దీనికి కారణం.
ఇప్పుడు కరోనా ఏవై 4.2 కేసులు యూకేను కలవరపెడుతున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా కరోనా ఏవై 4.2 వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్ లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్ లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. అయితే ఆ మార్పుల్లో ఏవీపెద్దగా ప్రమాదకరం కాలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్ ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటన్ లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకీ ఆ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 52 వేల కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా పరిశోధకులు తెలిపారు. ఇక రష్యాలో కూడా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదగవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 37 వేల 141 కొత్త కేసులు నమోదు కాగా 1 వేయి 64 మంది మరణించారు. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2 లక్షల 28 వేల 453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రజలను కోరారు.
రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్ ప్రజల ను కోరారు. మాస్క్ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్ చేయాలని యోచిస్తోంది.
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఈ కంపెనీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన అధ్యయనం వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తన సొంత సమీక్ష చేసిన తర్వాత పిల్లలకు వ్యాక్సిన్‌ను సిఫారసు చేయనుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీకాపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో 5–11 ఏళ్ల వయసు మధ్య వారు దాదాపుగా 2.8 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ టీకాలు ఇవ్వాలని, అప్పుడే నిర్భయంగా పిల్లలందరూ స్కూళ్లకి వస్తారని తల్లిదండ్రులు అంటున్నారు.