‘మా వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.. మా వాడు యూరప్ లో పెద్ద కంపెనీలో ఉన్నాడు తెలుసా?’ అంటూ ఇన్నాళ్లు తెలుగువారు గొప్పగా చెప్పుకునేవారు.. అమెరికా సహా విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారిని సమాజం కూడా గొప్పగా చూసేది. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు డాలర్ల వేట చెదిరిపోయింది. విదేశీ మోజు పడిపోయిందని చెప్పవచ్చు.
భారతీయులు విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. బాగా చదువుతారు. అందుకే అమెరికా అగ్రశ్రేణి కంపెనీలకు సైతం సీఈవోలయ్యారు. దేశంలో తల్లిదండ్రులు పిల్లలను అమెరికా సహా విదేశాల్లోకి పంపడానికి ఆస్తులు అమ్ముకున్న వారు.. బ్యాంకు రుణాలు తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. పిల్లలు డాలర్లు సంపాదిస్తారని ఆశతో ఇదంతా చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు తమ పిల్లలను అమెరికా, యూకే,ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లి చదివిస్తున్నారు. విదేశీ వ్యాపారం ఇప్పుడు ఎంతో లాభదాయకంగా ఉంది.
విదేశాల్లో చదివితే మంచి కెరీర్ అవకాశాలు దక్కుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు ఎగబడుతున్నారు. కానీ ఇప్పుడు కరోనాతో అంతా తల్లకిందులైంది. ధనిక దేశాల్లో కరోనాతో మరణ మృదంగం వినిపిస్తోంది. అన్నీ బంద్ అయిపోయాయి. తెలుగువారు విదేశాల్లో లాక్ డౌన్ తో తినడానికి తిండి లేక బతకడమే గగనమైన పరిస్థితి. కరోనాతో ఎక్కడ చచ్చిపోతారోనన్న భయం వెంటాడుతోంది. ఒకప్పుడు ఎంతో సురక్షితమైన అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు కరోనాతో సురక్షితం కాదన్న భావన తల్లిదండ్రుల్లో వచ్చేసింది. భారత్ లో కరోనా ఎంతో నియంత్రణ లో ఉండడం తో మన దేశమే మేలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల ఆలోచనల్లో భారీ మార్పులు వస్తున్నాయి. పిల్లలను ఇక నుంచి విద్య, ఉద్యోగాలకు విదేశాలకు పంపించమని వారు గట్టిగా నిర్ణయించుకుంటున్నారు.
డబ్బు కోసమే విదేశాలకు పంపారు. ఇప్పుడు ఆ డబ్బు కాదు.. ప్రాణమే పోతోంది. అందుకే మన దేశంలోనే ఉన్నదాంట్లో చేసుకొని బతకడమే నయం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.విదేశాల నుంచి రప్పించిన వారందరినీ తిరిగి ఆయా దేశాలకు పంపించే ఆలోచనలు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు.
ఇక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం చోటుచేసుకుంది. ఇది రికవరీ కావడానికి రెండేళ్లైనా పడుతుంది. సో విదేశాల్లోనూ ఉద్యోగాలు, జీతాలు కష్టమే. అందుకే భారతదేశమే బెటర్ అని అబ్రాడ్ పంపిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బతికుంటే బలుసాకు తినవచ్చు. ప్రాణాలు పోతే ఎంత డబ్బున్నా.. సంపాదించిన వేస్ట్. ఈ చిన్న సూత్రాన్ని అన్వయించుకొని మన తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పుడు విదేశీ మోజును కరోనా కారణంగా త్యజిస్తున్నారని చెప్పవచ్చు.