కరోనా దైన్యం.. తెలంగాణలో మరో విషాదం

Update: 2020-06-28 13:07 GMT
కరోనా అందరిలోనూ మానవత్వాన్ని దూరం చేస్తోంది. కొన ఊపిరితో ఉన్న రోగుల పట్ల  వైద్యులు కనికరం చూడం లేదు.   లక్షణాలు కనపడితే చాలు వైద్యం చేయడం లేదు వైద్యులు. అప్పట్లో జర్నటిస్ట్ మనోజ్ కూడా ఇలానే వైద్యం అందక మృతిచెందక తాజాగా మరో వ్యక్తి సేమ్ అలాగే ఊపిరి అందక మృతిచెందిన దైన్యం తెలంగాణలో కలకలం రేపింది.

వైద్యుల కర్కశత్వంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది.  హైదరాబాద్ లోని జవహర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి  ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి వచ్చాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా వెంటిలేటర్ ను తొలగించారని.. చనిపోయే ముందు తండ్రికి రోగి సెల్ఫీ వీడియో పంపాడు. 3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదని గుండె ఆగిపోతోందని.. ఊపిరి ఒక్కటే  కొట్టుకుంటుందంటూ వ్యక్తి తల్లడిల్లాడు.  వద్దన్న వినకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని.. తాను చచ్చిపోతున్నా  అంటూ సదురు రోగి వీడియోలో వేడుకున్న వైనం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. తెలంగాణలో వైద్యం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

తెలంగాణలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. వీడియో చూసిన నెటిజన్లు వైద్యులను తిట్టిపోస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జర్నలిస్టు మనోజ్ లాగే ఈ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది.


Full View
Tags:    

Similar News