కరోనా రోగులు ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్ ను ఇలా వాడాలి..

Update: 2021-05-16 13:30 GMT
భార‌త్ పై క‌రోనా మ‌హ‌మ్మారి భీక‌ర‌మైన దాడిని కొన‌సాగిస్తోంది. నిత్యం ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. చ‌నిపోతున్న‌ వారిలో చాలా మంది ఆక్సీజ‌న్ అంద‌క‌నే మ‌ర‌ణించడం అత్యంత విషాదక‌రం. దీంతో.. ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు, కాన్ స‌న్ ట్రేట‌ర్ల ప్రాధాన్యం విప‌రీతంగా పెరిగిపోయింది.

అయితే.. ఆక్సీజ‌న్‌ సిలిండ‌ర్ గురించి చాలా మందికి తెలుసు. కానీ.. ఆక్సీజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్ గురించి దాదాపుగా తెలియ‌దు. కానీ.. ఇప్పుడు చాలా మందికి అవ‌స‌రంగా మారిపోయింది. గ‌తంలో ఈ పేరుకూడా విన‌నివారు సైతం.. ఈ కాన్స‌న్ ట్రేట‌ర్లు కొనుక్కోవ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. సిలిండ‌ర్ మాదిరిగా.. మ‌ళ్లీ నింపుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డంతో.. అంద‌రికీ ఫ‌స్ట్ ఛాయిస్ గా మారింది కాన్ స‌న్ ట్రేట‌ర్‌.

ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్ నేరుగా గాలిలోంచి మ‌న‌కు ఆక్సీజ‌న్ బైఫ‌ర్ కేట్ చేసి అందిస్తుంది. మ‌న చుట్టూ ఉండే గాలిలో దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. కేవ‌లం 21 శాతం మాత్ర‌మే ఆక్సిజన్‌ ఉంటుంది. 78 ప్ల‌స్ 21 మొత్తం క‌లిపితే 99. మిగిలిన ఒక శాతంలో ప్రమాదకరమైన విష వాయువులు ఉంటాయి. ఈ విధంగా అన్ని వాయువులూ క‌లిసి ఉన్న‌ గాలిలోంచి.. ఆక్సీజ‌న్ ను వేరు చేసి స్వ‌చ్ఛ‌మైన ఊపిరిని అందించేదే ఆక్సీజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్‌. మ‌రి, దాన్ని ఎలా వాడాలి అనేది చూద్దాం.

1. కాన్స‌న్ ట్రేట‌ర్ క‌రెంటుతో ప‌నిచేస్తుంది. దీన్ని ఇంటి గోడ‌కు 2 అడుగుల దూరంలో ఉంచాలి. ఇది ర‌న్ అవుతున్న‌ప్పుడు వేడి వ‌స్తుంది. ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తి 2 నుంచి 3 లీట‌ర్ల క‌న్నా ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు వేడి ఎక్కువ‌గా ఉంటుంది. డాక్ట‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఒక తేమ బాటిల్ ను క‌నెక్ట్ చేయాల్సి ఉంటుంది.

2. తేమ బాటిల్ ను ఆక్సీజ‌న్ పైపుల‌కు అడాప్ట‌ర్ ద్వారా అటాచ్ చేయాలి. కాన్స‌న్ ట్రేట‌ర్ ను ఆన్ చేసే ముందు ఎయిర్ ఇన్లెట్ ఫిల్ట‌ర్ ఆన్ చేసి ఉండాలి. దీన్ని ఐదారు రోజుల‌కు ఒక‌సారి గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేయాలి. త‌డి ఆరిపోయిన త‌ర్వాత వాడాలి.

3. కాన్స‌న్ ట్రేట‌ర్ ఆన్ చేయ‌గానే వినియోగించొద్దు. 20 నిమిషాల పాటు ఆన్ లో ఉంచాలి. ఈ టైమ్ లో మెషీన్ గాలిని ఫిల్ట‌ర్ చేసి, ఆక్సీజ‌న్ ఇవ్వ‌డానికి సిద్ధం అవుతుంది.

4. మెషీన్ స‌రిగా ప‌నిచేస్తుందో లేదో అనేది దానికి ఉన్న‌ లైట్ సూచిస్తుంబ‌ది. అది నిరంత‌రం వెలుగుతూనే ఉండాలి.

5. ఆక్సీజ‌న్ లీట‌ర్ కంట్రోల్ నాబ్ ను నిమిషానికి ఎంత మేర పెట్టాల‌నేది సెట్ చేయాల్సి ఉంటుంది. అది రోగి ప‌రిస్థితిని బ‌ట్టి వైద్యుడు సూచించాల్సి ఉంటుంది. ఆయ‌న సూచ‌న మేర‌కే దాన్నిసెట్ చేయాలి.

6. ఆక్సీజ‌న్ పైపులో వంక‌లు, మ‌డ‌త‌లు లేకుండా చూడాలి. వ‌స్తున్న గాలిని వృథా కాకుండా.. ముక్కుకు స‌రిగ్గా సెట్ చేసుకొని గాలిని పీల్చుకోవాలి.




Tags:    

Similar News