కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు అందరిని అతలాకుతలం చేస్తోంది. అన్ని రంగాలపై ఈ మాయదారి మహమ్మారి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. క్రీడా రంగంపై కూడా పంజా విసిరింది. దీంతో మెగా టోర్నీలు సైతం రద్దు చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ , వాయిదా తర్వాత ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అయితే, మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలను కరోనా మహమ్మారి వీడట్లేదు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విలేజ్ లో నిర్థారిత కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగు చూసింది.
దీనితో, ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో మొదలైయ్యాయి. ఒలింపిక్ అథ్లెట్స్ విలేజ్‌లో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు టోక్యో ఒలింపిక్స్ 2020 సీఈఓ తొషీరో ముటో చెప్పారు. ఈ వ్యక్తి గేమ్స్ ఆర్గనైజింగ్‌లో సభ్యుడిగా ఉన్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.
ఇక కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని అథ్లెట్స్ విలేజ్ నుంచి దూరంగా ఐసొలేషన్ లో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఓ హోటల్‌లో ఆ వ్యక్తిని ఉంచినట్లు వెల్లడించారు. ఇక కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు చీఫ్ ఆర్గనైజర్ సీకో హషిమోటో. ఒకవేళ కోవిడ్ విజృంభిస్తే మరో ప్లాన్ ను సిద్ధం చేసి ఉంచామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ,రష్యా రగ్బీ జట్టులోని ఐదుగురు సిబ్బందికి కూడా వైరస్ సోకిందని నిర్వాహకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్రెజిలియన్ జూడో బృందానికి ఆతిథ్యమిస్తున్న జపనీస్ హోటల్‌లోని ఎనిమిది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారట. ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వహణ కమిటీ తెలిపింది. పాజిటివ్ అని నిర్ధారణ అయిన అథ్లెట్ ఒలింపిక్స్ గ్రామంకు ఇంకా చేరుకోలేదని గురువారం ఒలింపిక్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది.
అంతకుముందు బ్రెజిల్ ఒలింపిక్ జట్టు బస చేసిన హోటల్‌లో ఏడుగురు సిబ్బంది, కెన్యా మహిళా రగ్బీ జట్టులో ఎనిమిది మంది సభ్యులకు పాజిటివ్గా తేలింది. కెన్యా మహిళా రగ్బీ జట్టులోని ఎనిమిది మంది సభ్యులు జపాన్‌లోని కురుమెలో శిక్షణా శిబిరం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం టోక్యోకు వెళ్లే సమయంలో ప్రయాణీకులతో వారు సన్నిహితంగా మెలిగారట. అక్కడే వైరస్ సోకిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
టోక్యోలో ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఈ వారంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
అయితే కరోనా జాగ్రత్తల నడుమ విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ధీమా వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో మెగా క్రీడలు జరుగుతాయని స్పష్టం చేశారు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితో పాటు హైప్రొఫైల్ అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండటంతో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ పై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే తేల్చింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మందికి మాత్రమే గేమ్స్ పై ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది.
క్రీడలు జరిగే జపాన్ లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని వెల్లడైంది. జూలై 23 నుంచి ఆగష్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ జరుగుతాయి. ఇదిలా ఉంటే విదేశాల నుంచి వస్తున్న క్రీడాకారులు, ఇతర నిర్వాహకులతో ఒలింపిక్స్ గేమ్స్ ఒక సూపర్ స్ప్రెడర్‌గా అవతరించే అవకాశం ఉందని పలువురు నిపుణులు ఆందోళన