గుంటూరులో కరోనా కేసులు పెరగడానికి కారణం ఏంటో తెలుసా ?

Update: 2020-04-23 02:30 GMT
ఏపీలో గుంటూరు జిల్లలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గుంటూరులో కరోనా కేసులుపెరగడానికి గల కారణాలను అధికార యంత్రాంగం గుర్తించింది. సీఎం ఆదేశాల మేరకు కరోనా వేగంగా స్ప్రెడ్ అవుతున్న నాలుగు జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం వున్న గుంటూరు జిల్లాపై ఉన్నతాధికారులు స్పెషల్ ‌గా దృష్టి పెట్టారు. దీనితో గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలడానికి, అతి వేగంగా విస్తరించడానికి కారణాలు గుర్తించారు.

బుధవారం (ఏప్రిల్ 22 ) నాటికి గుంటూరు జిల్లాలో మొత్తం 177 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 105 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళిన వారేనని అధికారులు గుర్తించారు. వీరి ద్వారానే గుంటూరు సిటీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మొత్తం 180 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చినట్లు గుర్తించారు.

అలాగే, విదేశాల నుండి తిరిగి వచ్చిన ఒక్క మహిళకు మాత్రమే పాజిటివ్ వచ్చింది. గుంటూరు నగరంలోని సంగడిగుంట, ఆనంద పేట, కుమ్మరి బజార్ ల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గుంటూరు రూరల్ జిల్లాలో నర్సరావుపేటలో అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయి. కేబుల్ ఆపరేటర్, హోంగార్డు.. వీరిద్దిరి వల్లే నర్సరావుపేటలో అత్యధిక కేసులు వచ్చాయి. అలాగే హోంగార్డు చికిత్స చేయించుకున్న ఆసుపత్రిలో మొత్తం పది కేసులు నమోదయ్యాయి. ఓకే కుటుంబం లో పదకొండు మందికి, మరో కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ఒక వార్డు వాలెంటీర్, హోంగార్డు, ఆర్ ఎం పి వైద్యుడు, వాణిజ్య పన్నుల శాఖాధికారి, పీజీ వైద్య విద్యార్థిని, మరొక వైద్యురాలు ఇలా అన్ని వర్గాల నుండి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా జిల్లాలో ఎందుకు ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయో గుర్తించిన అధికారులు ..జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇరవై మూడు మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఐదు వేల మందికి పైగా కరోనా టెస్ట్ లు నిర్వహించారు. మరో పదిహేను వందల కేసుల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సకాలంలోనే గుర్తించినా.. సెకండరీ కాంటాక్ట్స్‌ని గుర్తించడం, టెస్ట్‌లు చేయడంలో జాప్యం జరగడం వల్లనే పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు.
Tags:    

Similar News