రోనా కబళిస్తోంది. వరుసగా ప్రముఖులను ఆవహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎక్కువశాతం మందికి సోకుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
కేంద్రంలో వరుసగా కేంద్రమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు.
ఏపీలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాజకీయ నాయకులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు పెద్దగా కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
ఇక వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు హోం క్వారంటైన్ లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10548 పాజిటివ్ కేసులు.. 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. మృతుల సంఖ్య 3796కు చేరింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1096 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇబ్బందికి గురిచేసింది.