హైదరాబాద్ మేయర్ కు కరోనా పాజిటివ్?

Update: 2020-07-26 10:50 GMT
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలంగా మారింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో భాగ్యనగరంలో జనాభా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.

కాగా హైదరాబాద్ ను పాలించే ప్రథమ పౌరుడైన మేయర్ బొంతు రామ్మోహన్ కు కూడా కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మేయర్ కు లక్షణాలు లేకపోయినా ఆయనకు టెస్టు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు మీడియాల్లో ప్రచారం జరుగుతోంది.

రామ్మోహన్ కు కరోనా అని తేలడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారట.. రామ్మోహన్ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది.

గతంలో మేయర్ రామ్మోహన్ కారు డ్రైవర్, టీ తాగిన హోటల్ యజమానికి కరోనా రావడంతో రామ్మోహన్ 2 సార్లు టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాజాగా పాజిటివ్ గా వచ్చినట్టు సమాచారం.
Tags:    

Similar News