ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌!

Update: 2021-03-23 10:30 GMT
క‌రోనా రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా వ‌దిలి పెట్ట‌ట్లేదు. ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ మండ‌లి స‌భ్యుడు స‌తీష్ కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా.. మ‌ల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి క‌రోనా సోకింది. త‌న‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింద‌ని స్వ‌యంగా రేవంత్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. ఈ స‌మావేశాల్లో ప‌లు అంశాల‌పై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ కు క‌రోనా వైర‌స్ వ్యాపించి ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. లేదంటే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ విస్తృతంగా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా అయ్యి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.రేవంత్ మాత్రం.. త‌న‌కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది కాబ‌ట్టి.. గ‌త మూడునాలుగు రోజులుగా త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని కోరారు. కాగా.. పార్ల‌మెంట్ లో ఇంకా ఎంత మందికి క‌రోనా వ‌స్తుందో అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వు‌తోంది.

ఇదిలా ఉండ‌గా.. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగానే సాగేట్టు క‌నిపిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతుండ‌డం ఇదే విష‌యాన్ని సూచిస్తోంది. రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్రం కూడా సూచించింది. ఇప్పుడు వ‌రుస‌గా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ భ‌యాందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News