గంట గంట కి దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం పెరిగిపోతుంది. ఈ కరోనా మహమ్మారి ని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఎంత కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే తొలిదశ లాక్ డౌన్ గడువు ముగిసినా కూడా కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకొని ..మరోసారి మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.
కాగా , దేశంలో కరోనా కేసుల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. ఈ విషయం పక్కన పెడితే .. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అధికార నివాసమైన వర్ష బంగళా వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు ఆదివారం వచ్చిన రిపోర్టులో తేలింది అని - దానితో వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరుగురు పోలీస్ సిబ్బంది క్వారంటైన్ కు పంపారు అని సామజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
ఈ విషయంపై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. ఓ మహిళా కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అలాగే ఆమె కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నాం అని తెలిపారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ ఇటీవలే సీఎం అధికారిక భవనంలో విధులు నిర్వహించేందుకు వెళ్లినట్లు సామజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీనిపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.