కరోనా ఎఫెక్ట్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఓ రూమ్ మూసివేత !

Update: 2020-05-06 10:50 GMT
కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కూడా దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీ లో విఐపి , వివిఐపి జోన్లో కూడా కరోనా విస్తరిస్తుంది.

కాగా, కరోనా కట్టడి చర్యల కోసం ఏర్పాటు చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్‌ రూం మొదటి గదిని మూసేశారు. ఇక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు సీఆర్‌ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడంతో రూం నెంబర్ వన్‌ ను మూసేశారు. రూం నెంబర్ వన్‌ లో పనిచేసే సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌‌ కు వెళ్లారు. శానిటైజింగ్ ప్రక్రియ తర్వాత గదిని తిరిగి తెరుస్తారు. అయితే, రూమ్ నెంబర్ ఒకటి మాత్రమే మూతపడింది. మిగతా అన్ని గదుల్లో విధులు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News