మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 4,08,764 మంది చనిపోయారు. కరోనా నుంచి మరో 39,649 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,00,14,713. దేశంలో ప్రస్తుతం 4,50,899 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376. ఇప్పటి వరకు 37.73 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరగగా, గడిచిన 24 గంటల్లో 12,35,287 మంది టీకాలు తీసుకున్నారు. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది.
ఇండియాలో యాక్టివ్ కేసులు 3,219 తగ్గాయి. దేశంలోనే అత్యధికంగా కేరళలో కొత్తగా 12,220 కేసులు రాగా... ఆ తర్వాత అత్యధికంగా నిన్న మహారాష్ట్రలో 8,535 కేసులు వచ్చాయి. ఆ తర్వాత తమిళనాడులో 2,775 కేసులు రాగా... ఏపీలో 2,665 వచ్చాయి. మరణాలు చూస్తే... నిన్న దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 350 మంది చనిపోగా... కేరళలో 97, ఒడిశాలో 65 మంది చనిపోయారు. దేశంలో వరుసగా 15వ రోజు 50వేల కంటే తక్కువగా కొత్త కేసులు వచ్చాయి. అలాగే మరణాలు... వరుసగా రెండో రోజు వెయ్యి కంటే తక్కువ వచ్చాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలితాల్లో కొత్త మరణాలు జీరో వచ్చాయి. అలాగే 27 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు 10 కంటే తక్కువ వచ్చాయి