కరోనా ఆంక్షలు షూరూ.. ఏపీలో మార్గదర్శకాలివీ

Update: 2022-01-10 09:46 GMT
ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా రూపాంతరం చెందిన ‘ఒమిక్రాన్’ వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వేల కేసులు నమోదు చేయిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఆంక్షలు మొదలు కాగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాత్రి కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది.

ఇక ఏపీలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం జగన్ సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

-టాలీవుడ్ కు షాక్

ఏపీలో ప్రభుత్వం నిర్ధేషించిన కోవిడ్ నిబంధనలు టాలీవుడ్ కు షాకింగ్ గా మారాయి. 50శాతం సామర్థ్యంతో మాత్రమే థియేటర్లు నడపాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని స్పష్టం చేసింది.

ఇక బస్సుల్లో ప్రయాణికులు మాస్కులు.. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి.. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
Tags:    

Similar News