ఏపీలో పెళ్లిళ్ల పై కరోనా ఆంక్షలు ..కండిషన్స్ ఇవే

Update: 2021-08-10 06:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో  పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి పెంచుతూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్  సెకండ్ వేవ్  నేపధ్యంలో లాక్‌ డౌన్ ముగిసిన తరువాత పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ కేవలం 20 మందికి మాత్రమే గరిష్ట అనుమతి ఉంది. అది కూడా తహశిల్దార్‌ తో అనుమతి తప్పనిసరి.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో ఆంక్షల్ని సడలిస్తోంది ఏపీ ప్రభుత్వం. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా పూర్తిగా ఆంక్షల్ని సడలించకుండా అనుమతి పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. వివాహాలపై కరోనా కాటు వేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పెళ్లి ముహూర్తాలు తరుముకొచ్చాయి. కానీ పెళ్లి గ్రాండ్ గా చేద్దామంటే ఇప్పుడు కరోనా కాటు. దీంతో వివాహ వేడుకలకు సిద్ధమైన తల్లిదండ్రులంతా ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. ఇకపై పెళ్లి చేసుకోవాలి అంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే అంటోంది ప్రభుత్వం

ఇక నుంచి  ఆంధ్రప్రదేశ్ లో పెళ్లిళ్లతో పాటు ఏ ఫంక్షన్లు, ప్రార్ధనలైనా సరే గరిష్టంగా 150 మంది మించకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కరోనా వైరస్ నిబంధనలు కఠినంగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇటు సినిమా హాళ్లలో మాత్రం 50 శాతం అనుమతిచ్చారు. తాజా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు తగిన ప్రణాళిక రూపొందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Tags:    

Similar News