కరోనా కల్లోలం:అయినా స్కూళ్లు మూసివేయరా?

Update: 2021-04-15 09:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అయితే కరోనా కల్లోలం చోటుచేసుకుంది. గుజరాత్ లోనూ కరోనా మృతదేహాలతో శ్మశనాలు నిండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకు వేయి కేసులు దాటుతున్నాయి. మరణాలు ఎక్కువ అవుతున్నాయి.

ఇంతటి ఉపద్రవంలోనూ ఏపీలో పాఠశాలల కొనసాగింపుపై దుమారం చెలరేగుతోంది. తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ కరోనా కేసులు వస్తున్నా.. సర్కార్ విద్యాసంస్థల మూసివేతపై నిర్ణయం తీసుకోవట్లేదు.

విద్యార్థులు కరోనా కారియర్లుగా మారి తల్లిదండ్రులకు, ముసలివాళ్లకు కరోనా అంటించే ప్రమాదముందని తెలిసినా జగన్ సర్కార్ పాఠశాలలు కొనసాగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక పరీక్షలు వాయిదా ఉండదని.. తప్పకుండా ఉంటాయని జగన్ సర్కార్ చెప్పడం తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కరోనా తగ్గే వరకు పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News