సెకండ్ వేవ్ : తాతా.. నీకేం కాదు, నేనున్నాను !

Update: 2021-05-11 23:30 GMT
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల కొద్ది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా సోకితే  తోబుట్టువులే వదిలేసిన ఘటనలను గతంలో మనం చూసాం. వారి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ చిన్నప్పటి నుంచి తనను గుండెలపై ఎత్తుకొని పెంచిన తాతను కాపాడుకునేందుకు ఓ మనుమడు పడిన వేదన అక్కడున్న వారికి కంటతడి పెట్టించింది. విజయవాడకు చెందిన ఎస్‌.గోపాలరావు వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు.

సోమవారం ఆయనను విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రికి మనుమడు తీసుకొచ్చాడు. ఓ చోట పడుకోబెట్టి పరుగున వెళ్లి ఓపి రాయించాడు. నాలుగు గంటలు ఆసుపత్రి ఆవరణలో ఆయాసంతో లేవలేని స్థితిలో పడుకున్నాడు. దీనితో  మనుమడు నీళ్లు పట్టిస్తూ, ముఖం మీద నీళ్లు జల్లుతూ తాతా, నీకేం కాదు. నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. కొద్దిసేపు ఓపికపట్టు తాతా, నువ్వు చచ్చిపోతే నేనూ చచ్చిపోతా తాతా, నా గురించైనా నువ్వు బతకాలి తాతా అంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారికి కళ్లవెంట నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటికి స్ట్రెచర్‌ తీసుకొచ్చి  తాతా  అంటూ స్ట్రెచర్‌ పై పడుకోబెట్టి తానే తోసుకుంటూ ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు.
Tags:    

Similar News