చైనాలో 'కరోనా' సెన్సేషన్

Update: 2020-04-07 17:30 GMT
కరోనా వైరస్ జన్మస్థానం ఏది అంటే చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు చైనా అని. ప్రపంచం మీద బయో వార్ చేసే ఉద్దేశంతో చైనీయులే ఈ వైరస్‌ను సృష్టించారని.. ఐతే అది ప్రమాదవశాత్తూ అక్కడి వారికే సోకి ముందు చైనానే ఈ వైరస్ ధాటికి బలైందన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఆ ప్రచారం సంగతలా ఉంచితే కరోనా వైరస్ ధాటికి అల్లకల్లోలమైన వుహాన్ నగరంలో దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలు చేయడం.. కేసులు తగ్గుముఖం పట్టాక గత నెలలోనే లాక్ డౌన్ సడలించడం.. అక్కడ మాంసం మార్కెట్లు సహా అన్నీ తెరుచుకోవడం తెలిసిన సంగతే. ఐతే లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది కానీ.. పూర్తిగా అయితే వైరస్ కట్టడి కాలేదు. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఐతే క్రమంగా ఆ సంఖ్య కూడా తగ్గుతూ వచ్చిందని సమాచారం.

చైనా తాజా మీడియా సమాచారం ప్రకారం 40 గంటల పాటు వుహాన్ సహా ఆ దేశంలో ఎక్కడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. కరోనా వైరస్ బయటపడ్డాక ఇలా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం గొప్ప విషయమే. రోజూ వేలల్లో కేసులు నమోదయ్యే దశ నుంచి ఒక్క కేసు కూడా నమోదవని స్థితికి చైనా చేరిందంటే వాళ్ల కట్టుబాటు చర్యలు గొప్పగా ఉన్నట్లే. ఐతే కరోనా కేసులు, మరణాల విషయంలో చైనాలో జరుగుతున్నదొకటి.. బయటికి చెబుతున్నదొకటి అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. అక్కడ కరోనా వల్ల లక్ష మందికి తక్కువ కాకుండా చనిపోయారని.. కానీ ప్రపంచానికి రిపోర్ట్ చేసింది మాత్రం 5 వేల మరణాల లోపే అని.. చైనా ఏం చెప్పినా నమ్మడానికి వీల్లేదని ఇంటర్నేషనల్ మీడియా అంటోంది. మరి 40 గంటల పాటు చైనాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న వార్తలో నిజమెంతో?
Tags:    

Similar News