ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారత దేశాన్ని అంతగా ప్రభావితం చేయలేదన్న మాట గడిచిన కొద్ది రోజులుగా వినిపిస్తున్నా.. మార్చి పది తర్వాత పరిస్థితి మారినట్లుగా చెప్పాలి. అప్పటివరకూ డబుల్ డిజిట్ దాటని కేసులు.. ఒక్కసారిగా పెరగటం మొదలయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న వారు పెద్ద ఎత్తున ఉండటం.. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించటం.. ముందస్తుగా క్వారంటైన్ చేసే విషయంలో దొర్లిన పొరపాట్లు కూడా తాజా వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు.
తెలంగాణలో ఎలా అయితే.. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా క్వారంటైన్ చేయాలని గత ఆదివారం నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధానాన్ని కేంద్రం కూడా తీసుకొని.. అన్ని రాష్ట్రాలకు ముందే ఆదేశాలు జారీ చేయటం.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నట్లైయితే.. ఈ రోజు కరోనా వైరస్ వ్యాప్తి ఇలా ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి విషయం లో దేశం రెండో స్టేజ్ లోకి వెళ్లినట్లుగా మూడు రోజుల క్రితం కేంద్రానికి చెందిన కీలక అధికారి వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కరోనా విషయంలో దేశం రెండో స్టేజ్ లోకి వెళ్లినా..తెలంగాణలో మాత్రం మొదటి స్టేజ్ లోనే ఉన్న పరిస్థితి. బుధవారం రాత్రి పది గంటల సమయానికి మొత్తం పదమూడు పాజిటివ్ కేసులు.. అందులో ఎనిమిది ఒకేరోజు నమోదైనప్పటికీ.. తెలంగాణ కరోనా విషయంలో స్టేజ్ వన్ లోనే ఉన్నట్లు చెప్పాలి.
ఎందుకంటే.. విదేశాల నుంచి వచ్చిన విదేశీయులు.. స్వదేశీయులే కరోనా పాజిటివ్ కేసులుగా నమోదయ్యారు తప్పించి.. స్థానికులు ఎవరూ కూడా ఇప్పటి వరకూ పాజిటివ్ కాలేదు. కాకుంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చిన వారు తెలంగాణ రాష్ట్రంలోని స్థానికులను కాంట్రాక్టు అయిన నేపథ్యంలో.. పాజిటివ్ కేసులు నమోదు అవుతాయా? అన్నది ఇప్పుడు టెన్షన్ గా మారింది. ఒకవేళ.. ఇప్పుడున్న అనుమానాలు నిజమై.. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో కరోనా వ్యాప్తికి సంబంధించి స్టేజ్ టూలోకి అడుగు పెట్టినట్లుగా చెప్పక తప్పదు. వాస్తవానికి స్టేజ్ టూలో కరోనా వ్యాప్తి కొంతమేర ఉన్నప్పటికీ.. అప్రమత్తత తో వ్యవహరిస్తే.. రెండో స్టేజ్ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాకుంటే.. ఇందుకు ప్రజలు ఎవరికి వారు అప్రమత్తతతో ఉండటం తో పాటు.. విదేశాల నుంచి వచ్చిన వారిని కాంటాక్టు అయ్యే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించటం.. అధికారులకు సమాచారం ఇవ్వటం చాలా అవసరమని చెప్పక తప్పదు.