ఈ ఏడాది ఏప్రిల్లో సొంతగడ్డపై అట్టహాసంగా మొదలైన ఐపీఎల్.. మేలో కరోనా ధాటికి అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. లీగ్ పరిధిలో వరుసగా రెండు రోజుల వ్యవధిలో మూణ్నాలుగు కేసులు వెలుగు చూడటంతో టోర్నీని ఆపేయక తప్పని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు యూఏఈలో టోర్నీని తిరిగి మొదలుపెట్టారు. ఐతే లీగ్‌లో మూడు రోజులు గడిచాయో లేదో.. మళ్లీ కరోనా పంచ్ పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతణ్ని క్వారంటైన్ చేశారు. అతడితో సన్నిహితంగా ఉన్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, ఇంకో ఐదుగురిని ఐసొలేషన్‌కు పంపారు. వీళ్లకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడం ఊరటనిచ్చే విషయమే. ఐతే బయటపడింది ఒక కరోనా కేసే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. నటరాజన్‌కు ఏ స్థితిలో కరోనా సోకిందన్నది ఆలోచిస్తే.. మళ్లీ లీగ్ ఆపేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయేమో అన్న ఆందోళన రేకెత్తుతోంది.
నటరాజన్ బబుల్లోకి అడుగు పెట్టిన పది రోజులకు కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇప్పుడు నిర్వాహకులను కంగారెత్తిస్తోంది. అతను ఇండియా నుంచి యూఏఈకు వచ్చిన రెండు మూడు రోజుల్లో కరోనా పాజిటివ్‌గా తేలి ఉంటే.. ఇండియాలో ఉన్నపుడే వైరస్ అంటించుకున్నాడనో.. విమాన ప్రయాణం చేస్తున్నపుడు కరోనా సోకిందనో అనుకోవచ్చు. అలా జరిగితే క్వారంటైన్లో ఉంచి నెగెటివ్ వచ్చాక బబుల్లోకి పంపేవారు. సమస్య తీరిపోయేది. కానీ అతను బబుల్లోకి ఎంటరయ్యాక పది రోజులకు పాజిటివ్‌గా తేలాడు.
అంటే బయో బబుల్ పకడ్బందీగా లేదని అర్థం. బబుల్ పక్కాగా నిర్వహించి ఉంటే కరోనా సోకే అవకాశమే లేదు. మేలో ఐపీఎల్ తొలి అంచె సందర్భంగా ఇండియాలో రెండో దశ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు విమాన ప్రయాణాలు చేశాక కొన్ని రోజులకు కేసులు బయటపడ్డాయి. ప్రయాణాలే పరోక్షంగా కరోనా సోకడానికి కారణమయ్యాయన్నది స్పష్టం. కానీ ఇక్కడ కొత్తగా ప్రయాణాలేమీ లేకపోయినా.. ఓ ఆటగాడు బబుల్లోకి వెళ్లిన పది రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలాడంటే బబుల్ బ్రేక్ అయిపోయిందని స్పష్టమవుతోంది. కాబట్టి ఇది ఒక్క కరోనా కేసుతో ఆగుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంకో ఒకట్రెండు కేసులు బయటపడ్డాయంటే మాత్రం మళ్లీ ఐపీఎల్ ఆపేయాల్సి వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.