కరోనా పరీక్షలు.. మూడు నిమిషాల్లోనే రిజల్ట్స్!

Update: 2022-04-16 06:29 GMT
కరోనా వచ్చాక తీసుకునే ట్రీట్ మెంట్ కంటే.. కరోనా వచ్చిందా లేదా అని తెలుసుకునే పరీక్షకే ప్రజలకు ఎక్కువగా భయపడుతుంటారు. ముక్కులో స్వాబ్ పరీక్ష కోసం చేసే ప్రక్రియ అంటే చాలా మంది జంకుతారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే.. స్వాబ్ పరీక్ష కోసం నీడిల్ లాంటి సన్నని పుల్లను చాలా లోపలి వరకూ పెడతారు. దీనిని చాలా మంది జంకుతారు. సాంపిల్ కలెక్ట్ చేసే సిబ్బంది కొంత మంది ఈ సన్నని పుల్లను నషాళానికి అంటేలా గట్టిగా పెట్టడం నిజంగా ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది అంటుంటారు.

ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా శ్వాసలో ద్వారానే కరోనా ఉందా లేదా అని నిర్ధారించే పరీక్ష రాబోతుంది. ఈ కొత్తరకం పరీక్షకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) గుర్తింపును ఇచ్చింది. ఇది రోగుల శ్వాసలో కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్లను గుర్తించగల సామర్థ్యం ఉన్న మొదటగా ప్రభుత్వం ఆమోదించిన పరికరం. అయితే బ్రీత అనరైజర్ 2,409 మందిపై జరిపిన అధ్యయనంలో 91.2 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి.

ఎఫ్డీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్.. దాని వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో కూడా ఫలితాలను అంచనా వేసేందుకు కూడా ఉపయోగపడనుంది. అయితే శ్వాస పరీక్ష మూడు నిమిషాల్లో ఫలితాలను అందిస్తుంది ఈ పరికరం.

ఇన్ ఫెక్షన్లు గురించేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగ పడుతుందని కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ నిపుణుల పర్యేవేక్షణలో అర్హత కలిగిన శిక్షణ పొందిన ఆపరేటర్ల ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుందని ఎఫ్డీఏ తెలిపింది.

డయాగ్నొస్టిక్ పరీక్షలతో వేగంగా ఫలితాలు వస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ అని ఎఫ్డీఏ సెంటర్ ఫర్ డివైజెస్ అండ్ రేడియోలాజికల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జెఫ్ షురెన్ అన్నారు. ప్రతి రోజూ సుమారం 160 నమూనాలను అంచనా వేసేందుకు ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని ఏజెన్సీ తెలిపింది. ఈ పరికరాన్ని ఆస్పత్రులు, కార్యాలయాల్లో ఉపయోగించవ్చని ఎఫ్డీఏ తెలిపింది.
Tags:    

Similar News