తెలుగు రాష్ట్రాలకు మరోసారి మహారాష్ట్ర ముప్పు

Update: 2021-06-01 03:40 GMT
ఇప్పటివరకు మొదటి.. రెండో వేవ్ లను చూశాం.. చూస్తున్నాం. పెద్ద ఎత్తున నమోదైన కేసులతో తల్లడిల్లిపోతున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు మరో వార్త వణుకు పుట్టిస్తోంది. ఏడాదిన్నర నుంచి కరోనాతో ఆగమాగం అయిపోతున్న వేళ.. ఇప్పుడు మహారాష్ట్రలో థర్డ్ వేవ్ మొదలైందన్న మాట కొత్త కంగారును తెప్పిస్తోంది. కరోనామహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు పెద్దల్ని.. ఆ మాటకు వస్తే పురుషుల్నే ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. తాజాగా మహారాష్ట్రలో ఎనిమిది వేల మంది పిల్లలకు కరోనా సోకిందన్న సమాచారం కొత్త సందేహాలకు తెర తీస్తోంది.

థర్డ్ వేవ్ లో పిల్లలకు కరోనాసోకుతుందన్న వాదనలో పస లేదని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఆ ముప్పు పొంచి ఉందని చెబుతన్నారు. దేశంలో సెకండ్ వేవ్ మొదలైంది మహారాష్ట్రలోనే అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే.. అక్కడ పెరిగిన కేసులు.. తర్వాతి రోజుల్లో తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్నిచూపించాయని చెబుతారు.

తాజాగా మహారాష్ట్రలో పిల్లలు పెద్దఎత్తున పాజిటివ్ కావటంతో.. ఇప్పుడా ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులుగా మహారాష్ట్ర.. ఒడిశా.. కర్ణాటక.. తమిళనాడు ఉన్నాయన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువ అయితే దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద తప్పనిసరిగా ఉంటుందని చెప్పక తప్పదు. సెకండ్ వేవ్ రెండు తెలుగు రాష్ట్రాల్ని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లక్కీగా సెకండ్ వేవ్ లో పిల్లలుపెద్దగా ప్రభావితమైంది లేదు. అందుకు భిన్నంగా ఇప్పుడు మహారాష్ట్రలో పిల్లలు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండటమే కాదు.. పిల్లల్ని సంరక్షించుకోవటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణలో నిలోఫర్ ఆసుపత్రిలో వెయ్యి పడకలతో పిల్లల కోసం ప్రత్యేకంగా కరోనా నోడల్ ఆసుపత్రిగా తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లుసాగుతున్నాయి. మిగిలిన ఆసుపత్రుల్లోనే అలాంటి పరిస్థితే. ఏపీ ప్రభుత్వం కూడా ఆ తరహాలో ఏర్పాట్లను ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ తీవ్రత కాస్తతగ్గి.. కేసుల నమోదు తగ్గాయని సంతోషిస్తున్న వేళ.. మహారాష్ట్ర లో నమోదవుతున్న పిల్లల కేసులు కొత్త టెన్షనకు తెర తీస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News