ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. గత ఏడాదిన్నరకి పైగా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ని అరికట్టడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీనితో వ్యాక్సినేషన్ ను ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ముందుకి తీసుకుపోతున్నారు. ఇక ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ ఖండంలో నిత్యం దాదాపు రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. 28 దేశాలలో రోజు వారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఓ వైపు డెల్టా వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగటం, మరో వైపు వ్యాక్సనేషన్ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగటం తో ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల డోసులు ఇచ్చారు. మన దేశంలో కూడా టీకా ప్రక్రియ జోరుగా సాగుతోంది. 25 శాతం మంది ప్రజలు రెండు డోసులు వేయించుకున్నారు. ఇక 60 శాతం మంది కనీసం ఒక్క డోసైనా వేసుకున్నారు. దీనిని బట్టి వ్యాక్సినేషన్ లో మనం విజయం సాధించామను చెప్పాలి. అమెరికా 54 శాతం మందికి టీకాలు ఇచ్చింది. ఇంకా చాలా అభివృద్ధి చెందిన దేశాలు టీకా కార్యక్రమంలో సక్సెస్ అయ్యాయి. కానీ ఆఫ్రికన్ దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 600 డోసుల్లో కేవలం రెండు శాతం మాత్రమే ఆఫ్రికాలో వేశారు. ఈ ట్రెండ్ మానవాళికి చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం డోసుల్లో 75 శాతం కేవలం పది దేశాల్లోనే ఇచ్చారు. ఆఫ్రికా ప్రజలలో కేవలం 3.5 శాతానికి మాత్రమే ఇప్పటి వరకు టీకా అందింది.
అంటే అంటే 600 కోట్ల డోసుల్లో 450 కోట్ల డోసులు కేవలం కొన్ని ధనిక దేశాలకు చేరాయి. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు రెండు డోసులు పూర్తి చేసుకుని బూస్టర్ డోసుకు కూడా సిద్ధమవుతున్నాయి. మన దేశంలో కూడా బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.కానీ ఆఫ్రికా ఖండంలో మొదటి డోసుకే దిక్కులేదు. వ్యాక్సినేషన్‌లో భారీ అసమానతలు నెలకొన్నాయి. కరోనాకు ధనిక పేద అన్న తేడా లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అది రూపాంతరం చెందుతుంది. ఆ కొత్త వేరియంట్ ప్రపంచంలో ఎక్కడికైనా వ్యాపించవచ్చు. వైరస్ మనిషిలోకి ప్రవేశించినప్పడు రూపాంతరం చెందుతుంది. ఎవరైనా టీకా వేసుకోకపోతే వారికి వైరస్ సోకుతుంది. ఆఫ్రికాలో 97 శాతం మంది టీకా వేసుకోలేదు. అంటే వారందరికీ వైరస్ సోకే అవకాశం ఉంది.
ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో వైరస్ సోకే అవకాశం ఉన్నప్పుడు అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఊహించుకోవచ్చు. ఎక్కువ మందకి సోకినపుడు వైరస్ సులభంగా రూపాంతరం చెందుతుంది. అలా ఏర్పడిన వేరియంట్స్ లో కొన్న ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న డెల్టా వేరియంట్ ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది.ఇప్పుడు ఆఫ్రికాపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టకపోతే చేతులారా మరో ముప్పును మనమే కొని తెచ్చుకున్నట్టవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ హెచ్చరిస్తోంది. ఆఫ్రికాలో మిగిలిన 97 శాతం మందికి సత్వరం టీకాలు పడకపోతే అక్కడ మహమ్మారి ఉధృతి పెరిగే ప్రమాదం ఉంది. ప్రమాదకరమై వేరియంట్లు బయటపడితే మళ్లీ ప్రంచానికి ప్రమాదంగా మారొచ్చు. చైనాలోని వూహాన్ లో పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తాన్ని కబళించింది.
ఆ తరువాత అది రూపాంతరం చెంది బ్రెజిల్, సౌతాఫ్రికా , యూకే , ఇండియాని ఊపేశాయి. ఇలా ఏ దేశంలో వేరియంట్ బయటపడినా అది అక్కడితో ఆగదు. ప్రంపచమంతా వ్యాపిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికాలో మరో కొత్త రూపాంతరం రిజిస్టర్ అయింది. అయితే అదృష్టవశాత్తూ అది పరిమితంగానే ఉంది. ఇతర దేశాలకు ఇప్పటివరకు వ్యాపించలేదు. కానీ వ్యాపించదన్న గ్యారంటీ లేదు. అందుకే ఆఫ్రికాపై ధనిక దేశాలు తక్షణం ఫోకస్ పెట్టిల్సిన అవసరం ఉంది. మరోవైపు, గాలి ద్వారా సంక్రమించేలా కరోనా రూపాంతరం చెందుతోందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌గా తెలుస్తోంది.