ప్రముఖ దేవాలయాలు.. పుణ్యక్షేత్రాల్లో రోజులో భారీ ఎత్తున పెళ్లిళ్లు జరగటం కొత్త విషయమేమీ కాదు. కరోనా వేళ.. ఆచితూచి అన్నట్లుగా పెళ్లిళ్లు చేస్తున్న వేళలోనూ.. దేవాలయాల వద్ద పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చోటు చేసుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో కనిపిస్తున్న ఈ ట్రెండ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని పరిస్థితి. ఆ మాటకు వస్తే.. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెళ్లిళ్లను ఎంత సింఫుల్ గా చేస్తే అంత మంచిదన్నమాట వినిపిస్తున్నా.. అందుకు భిన్నంగా ఘనంగా పెళ్లిళ్లు చేసి చిక్కుల్లో పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తమిళనాడులో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఆ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
తాజాగా.. శుక్రవారం ఒక్కరోజులోనే రాష్ట్రంలోని పలు దేవాలయాల వద్ద భారీ ఎత్తున పెళ్లిళ్లను నిర్వహించారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మదురైతో పాటు.. మరిన్ని దేవస్థానాల వద్ద వివాహ వేడుకల రద్దీ బాగా పెరిగింది. కడలూరులో శుక్రవారం ఒక్కరోజులోనే 200 పెళ్లిళ్లు జరగ్గా.. మదురై మీనాక్షి ఆలయం ఎదుట వంద పెళ్లిళ్లు జరగటం గమనార్హం. తల్లాకుళం పెరుమాళ్ ఆలయంతో పాటు తిరుప్పరంకుండ్రం మురగన్ దేవాలయం ఎదుట వందకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఇలా దేవాలయాల వద్ద జోరుగా సాగుతున్న వివాహాలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా.. అధికారులు మాత్రం భయపడుతున్నారు. దేవాలయాల వద్ద నిర్వహిస్తున్న పెళ్లిళ్లకు.. ఒక నిర్ణీత వ్యవధి ఇవ్వటం.. ఆ లోపు పూర్తి చేయటం. వారి వేడుక అయ్యాక.. మరో పెళ్లికి అనుమతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఇంత పెద్ద ఎత్తున పెళ్లిళ్లు ఒకే చోట జరగటం ఏ మాత్రం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది.