కరోనా వైరస్ ప్రస్తుతం చైనాని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ తో ఇప్పటికే ..సుమారుగా 2300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే చైనా తో పాటుగా మరో 25 దేశాలలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ అందరిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా చైనావ్యాప్తంగా పలు జైళ్లలో 500 మందికిపైగా ఖైదీలకు కొవిడ్-19 వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. చైనా తర్వాత అత్యధిక కొవిడ్-19 కేసులు జపాన్ తీరంలోని నౌకలో నమోదయ్యాయి. కాగా.. చైనాలో కొత్తగా 889 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య 76,700కు చేరింది. వూహాన్‌లో కొవిడ్-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు తన పెళ్లినే వాయిదా వేసుకున్న పెంగ్ (29) అనే యువవైద్యుడు చివరకు ఆ వైరస్ దాటికి బలైపోయాడు.
అలాగే ఇరాన్‌లో కొవిడ్-19 కారణంగా ఇద్దరు చనిపోయారు. ఇక దక్షిణ కొరియాలో వైరస్ బాధితుల సంఖ్య 204కు చేరింది. ఈ వైరస్ సోకిన ఒక వృద్ధురాలు స్థానిక చర్చిలో ప్రార్థనలు చేయడానికి వెళ్లినప్పుడు ఆమె ద్వారా చాలా మంది ఈ వైరస్ బారిన పడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చిన 45 మంది ఉక్రెయిన్ వాసులకు చేదు అనుభవం ఎదురైంది. వారిని దేశంలోకి అడుగు పెట్టనివ్వొద్దంటూ పలువురు ఆందోళనలకు దిగారు. అమెరికాలో కూడా కరోనా బాధితులపై దాడులు జరుగుతున్నాయి.
కాగా, కొవిడ్-19 విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఇక, చైనాలో మిగిలిపోయిన 80 మంది భారతీయులను తరలించడానికి పంపుతున్న సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానానికి అనుమతులు ఇవ్వడంలో తమవైపు నుంచి ఆలస్యమేమీ లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనేందుకు చైనా కుబేరుడు.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా.. కొలంబియా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం జాక్ మా ఫౌండేషన్ నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.