ఎన్నో ఆశలు , మరెన్నో కలలతో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఓ జంట పై విధి చిన్న చూపు చూసింది. పెళ్లికి పెట్టుకున్న కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లి కొడుకు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది. ఆ దుఖం నుంచి కోలుకోకముందే మరో షాకింగ్ విషయం వెలుగు చూసుంది. బాధితురాలి కుటుంబంలో ఆమెతో సహా మరో 8మందికి కరోనా సోకింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బాధితురాలి భర్తకి కోవిడ్ నెగిటివ్ గా నిర్దారణ అయింది.
దాంతో తమకు మహమ్మారి ఎవరి వద్ద నుంచి సోకిందో తెలియక ఆ కుటుంబం ఆందోళన చెందుతుంది. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీతా కుల్‌శ్రేష్టా మాట్లాడుతూ.. బాధితురాలి భర్త పెళ్లై పది రోజులు తిరక్కుండానే మరణించాడు. పెళ్లైన వెంటనే అస్వస్థకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 4న మరణించాడు. ఆ తర్వాత మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా నెగిటివ్ గా నిర్దారణ అయింది. దానితో మరణించిన అతడి వల్లనే వీరందరికి కోవిడ్ సోకిందనడానికి లేదు. ఇక బాధితురాలి కుటుంబంలో ఆమెతో పాటు అత్త, బావ మరికొందరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పనిలో ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము అని తెలిపారు.