కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ , కూడా అడవుల్లో ఉన్న అన్నలకి కరోనా కష్టాలు మొదలైయ్యాయి. కరోనా అడవులను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని సైతం వణికిస్తోంది. సాధారణంగా జనావాసాల్లో ఉన్నవారికి కరోనా సోకితే, వెంటనే హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ, అడవుల్లో ఉండే అన్నలకి కరోనా సోకితే వారు జనావాసాల్లోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేరు. అలాగని అడవుల్లోని ఉండలేరు. కరోనా లక్షణాలు ఉన్నా కూడా హాస్పిటల్ లో జాయిన్ అయ్యే అవకాశం లేక చాలామంది అలాగే ఉన్నారట.
గతంలో సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని టెర్రాం వద్ద మావోయిస్టులు జరిపిన వ్యూహాత్మక దాడిలో 24 మంది జవాన్ల మరణంతో ప్రతీకారం తీర్చుకోవటానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి . ఇప్పటికీ అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులకు ఇటు పోలీసులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని కుదేలు చేస్తోంది. దండకారణ్యంలో కరోనా మహమ్మారి కారణంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కరోనా కాటుకు బలయ్యారు. నిన్నటికి నిన్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నారాయణ అలియాస్ హరి భూషణ్ , ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క అలియాస్ సారక్క కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందినట్టు మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ధ్రువీకరించారు. దీంతో మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో బాధపడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇది పోలీసులకు అడ్వాంటేజ్ గా మారింది.
ఇక తాజాగా చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు టార్గెట్ గా ఉన్న ,ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో ఆకస్మిక మెరుపు దాడికి నాయకత్వం వహించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా, కరడుగట్టిన మావోయిస్టు గెరిల్లా, అతన్ని పట్టుకుంటే 25లక్షల రూపాయల రివార్డు ఉన్న విషయం తెలిసిందే. మావోయిస్టు కీలక నేత మాద్వి హిడ్మా కూడా కరోనా బారిన పడ్డారని, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అని ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ లోని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అతను లొంగిపోతే చికిత్స అందించి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వారు ప్రకటిస్తున్నారు. వందల సంఖ్యలో మావోలు కరోనా బారిన పడ్డారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారాంతపు సంతాల నుండి గిరిజనులకు , గిరిజనుల నుండి మావోలకు కరోనా వ్యాప్తి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పోలీసులు కూడా గట్టిగ గస్తీ కాయడం మొదలుపెట్టారు. తమ ప్రాబల్యాన్ని గొప్పగా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్ట్ పార్టీ కి కరోనా తీవ్ర నష్టం కల్గిస్తోంది.
ఇదిలా ఉంటే..నారాయణ అలియాస్ హరి భూషణ్ కరోనా కాటుకి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయన సతీమణి శారద కూడా కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మావోయిస్ట్ నేత యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ సతీమణి శారద మావోయిస్టు పార్టీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలుగా పని చేస్తున్నారు. గతంలో మావోయిస్టు పార్టీలోని చర్ల ,శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. భర్త మరణం ఆమెని బాగా కుంగదీసింది. తాజాగా హరిభూషణ్ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు తెలిసింది. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ మావోయిస్టు పార్టీ సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని వెల్లడించిన జాబితాలో శారద కూడా ఉన్నారు. అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న సమయంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని ఆందోళనలోకి నెట్టేస్తోంది.