కరోనా: ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన మరణాలు

Update: 2020-04-11 07:00 GMT
కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరణాల్లో తొలి రికార్డు నమోదైంది. శనివారంతో కరోనా మరణాలు ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటాయి. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా శనివారం వరకు 102734మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. 24 గంటల్లోనే 7400 మంది మరణించారు.  ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లోనే మరణాలు సంభవిస్తున్నాయి..

*అమెరికాలో ఒక్కరోజే కరోనా ధాటికి 1921మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 18748కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 4.88 లక్షలు దాటింది. ఇక కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది.  లాక్ డౌన్ తో పరిశ్రమల మూతతో మూడు వారాల్లోనే 1.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. న్యూయార్క్, న్యూజెర్సీ లో కరోనా తో చనిపోయిన వారితో శవాల గుట్టలు తయారవుతున్నాయి. హార్ట్ దీవిలో వీటిని పూడ్చి పెడుతున్నారు.

* ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇటలీలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. దీనిని అమెరికా అధిగమించే అవకాశఆలున్నాయి.

*సింగపూర్ లో పనిచేస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడ్డారు.

*యూరప్ లోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు.

*ఇటలీలో 18849మంది, అమెరికాలో 18747మంది, స్పెయిన్ లో 16081మంది, ఫ్రాన్స్ లో 13వేలు, బ్రిటన్ లో 8958మంది, ఇరాన్ 4వేలు, చైనాలో 3వేలు, బెల్జియంలో 3వేలు, జర్మనీలో 2వేలు, నెదర్లాండ్ లో 2వేలు, బ్రెజిల్ 1074మంది  కెనెడాలో 569 మంది ప్రాణాలు కోల్పోయారు.

*భారత్ లో 7600కు చేరిన కరోనా కేసులు
భారత దేశంలో కరోనా విస్తరిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 7600కు చేరింది. 24 గంటల్లోనే 900కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా మహారాష్ట్రలో 210 కేసులు నమోదయ్యాయి.  కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తొలి పది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు కూడా ఉన్నాయి. 249మంది కరోనా కారణంగా చనిపోయారు.

*తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణలో శుక్రవారం మరో 16 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 487కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ లో మరో 18మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. శుక్రవారం 18 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూ.గోదావరి 5, కర్నూలు2, నెల్లూరు2, ప్రకాశంలో 2 వంతున పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా ఆరుగురు మరణించారు. ఏపీలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 365 మందికి చేరింది.
Tags:    

Similar News