ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి టీకా ఒక్కటే శక్తివంతమైన ఆయుధం. వ్యాక్సిన్ వేసుకుంటేనే ఈ ప్రళయం నుంచి బయటపడగలమని ఇప్పటికే ఎందరో వైద్య నిపుణులు సూచించారు. అయితే పలు ఫార్మా కంపెనీలు తమవైన ఫార్ములాలతో ఇప్పటికే చాలా రకాల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక అన్ని దేశాలు కూడా లభ్యతను బట్టి వ్యాక్సినేషన్ ను దశలవారీగా కొనసాగిస్తున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే చాలా మంది టీకా తీసుకున్నారు. ప్రికాషన్ డోసును కూడా ప్రారంభించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ టీకాను పంపిణీ చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం గల టీకా ఓ మ్యాజిక్ చేసింది.
టీకా తీసుకోవడానికి తొలుత జనం చాలా భయపడ్డారు. లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి అనాసక్తి కనబరిచారు. ఆ తర్వాత రెండో వేవ్ పరిణామాలతో చాలామంది కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి సముఖత వ్యక్తం చేశారు. ఎన్నో అపోహలు గల ఆ టీకా ఓ మిరాకిల్ సృష్టించింది. మూగబోయిన నోట మాటను పలికించింది. మీరు చదివింది నిజమే. గతకొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముకకు బలమైన గాయం కావడం వల్ల మంచానికే పరిమితమయ్యాడు. అంతేకాకుండా ఆ ప్రమాదం జరిగిన నాటి నుంచి నోట మాట బంద్ అయింది. కాళ్లు, చేతులు కూడా చచ్చుబడిపోయాయి. అయితే టీకా వేసుకోగానే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా చచ్చుబడిన అవయవాలను సైతం కదిలిస్తున్నాడు. ఈ అద్బుతంతో అక్కడివారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో ఓ వ్యాక్సిన్ మ్యాజిక్ జరిగింది. పెతార్వార్ మండలం సల్వాడి గ్రామానికి చెందిన 55 ఏళ్ల దూలార్ చంద్ ముండా అనే వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. గతకొన్నాళ్లుగా మాట రాక మూగబోయాడు. అయితే ఆ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముండా కుటుంబసభ్యులంతా టీకా తీసుకున్నారు. వారితోపాటు ఆయనకు కూడా వ్యాక్సిన్ ఇప్పించారు. అందరికీ లాగే కొవిషీల్డు టీకాను ఆరోగ్య కార్యకర్తలు ముండాకు ఇచ్చారు. టీకా ఇచ్చిన అనంతరం ఆ మ్యాజిక్ చూసి అక్కడి వారంతా కూడా షాక్ అయ్యారు.
టీకా తీసుకున్న మరుసటి రోజు నుంచి ముండా మాట్లాడుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా చచ్చుబడిన అవయవాలు సైతం కదిలిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎన్నో మందులు వాడినా కూడా ఫలితం కనిపించలేదని... ఈ టీకాతో చాలా మార్పు వచ్చిందని వారు సంతోషపడుతున్నారు. ఐదేళ్ల నుంచి మంచానికే పరిమితమైన ముండాలో ఈ మిరాకిల్ జరగడంతో ఆ గ్రామస్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు వైద్య నిపుణులు సైతం స్పందించారు. నిజానికి వైద్య చరిత్రలో ఇది ఓ మిరాకిల్ అంటూ అభివర్ణించారు.