కరోనా టీకాతో భారత్‌ లో 42 లక్షల మంది బతికారు

Update: 2022-06-24 07:33 GMT
కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తూ.. లక్షల మందిని పెట్టుకుంటున్న తరుణంలో ప్రజల పాలిట సంజీవనిలా వచ్చింది కొవిడ్-19 వ్యాక్సిన్. ఈ టీకాతో లక్షల మంది ప్రాణాలు దక్కాయి. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుకోగలిగింది.

కరోనా టీకా ప్రభావంతో 2021లో 42 లశ్రలకు పైగా మరణాలు ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ నిర్వహించారు.

కొవిడ్-19 వ్యాక్సిన్.. కరోనా మహమ్మారిని దీటుగా అడ్డుకుని అనేక మంది ప్రాణాలను కాపాడింది. 2021 వ సంవత్సరంలో భారతదేశంలో 42 లక్షలకు పైగా మంది ని కరోనా బలి తీసుకోకుండా అడ్డుకోగలిగింది. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో దేశంలో అధిక మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చేసిన స్టడీని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌ ప్రచురించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌లు మహమ్మారి సమయంలో కొవిడ్ మృతుల సంఖ్యను సంవత్సరంలో సగానికి పైగా తగ్గించాయని ఈ స్టడీలో తేలింది. కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి ఏడాదిలో 185 దేశాలు.. భూభాగాల్లో నమోదైన అదనపు మరణాల ఆధారంగా వేసిన అంచనాల్లో ప్రపంచవ్యాప్తంగా 31.4 మిలియన్ల కొవిడ్ మరణాలు అంచనా వేస్తే.. అవి 19.8 మిలియన్ల వరకు నిరోధించగలిగారని పరిశోధకులు తెలిపారు.

2021 చివరి నాటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులతో ప్రతి దేశపు జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ లక్ష్యం నెరవేరితే మరో 5 లక్షల 99 వేల 300 మంది ప్రాణాలు కాపాడొచ్చని ఈ స్టడీ అంచనా వేసింది.

డిసెంబర్ 8, 2020 నుంచి డిసెంబర్ 8, 2021 వరకు ఆపగలిగిన కరోనా మరణాల సంఖ్యను ఈ స్టడీ అంచనా వేసింది. భారతదేశంలో, ఈ కాలంలో టీకా ద్వారా 42లక్షల 10 వేల మరణాలు ఆపగలిగామని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ అంచనాలో అనిశ్చితి 36,65,000 - 43,70,000 మధ్య ఉన్నట్లు వెల్లడించింది.
Tags:    

Similar News